సీనియర్ నటుడు కెప్టెన్ రాజు కన్నుమూత

తిరువనంతపురం: కేరళకు చెందిన సీనియర్ నటుడు కెప్టెన్ రాజు(68) కన్నుమూశారు. కొచ్చిలోని ఆయన నివాసంలో సోమవారం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో కొడుకు పెళ్లి కోసం కొచ్చి నుంచి అమెరికాకు వెళ్తున్న సమయంలో రాజుకు విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడ చికిత్స అనంతరం జూలై 2న కొచ్చికి తరలించారు. కేరళలోని పత్నామతిట్ట జిల్లా వాసి అయినా రాజు కొన్నాళ్లు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో విధులు […]

తిరువనంతపురం: కేరళకు చెందిన సీనియర్ నటుడు కెప్టెన్ రాజు(68) కన్నుమూశారు. కొచ్చిలోని ఆయన నివాసంలో సోమవారం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జూన్ లో కొడుకు పెళ్లి కోసం కొచ్చి నుంచి అమెరికాకు వెళ్తున్న సమయంలో రాజుకు విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడ చికిత్స అనంతరం జూలై 2న కొచ్చికి తరలించారు. కేరళలోని పత్నామతిట్ట జిల్లా వాసి అయినా రాజు కొన్నాళ్లు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో విధులు నిర్వహించారు. 1981లో వచ్చిన ‘రక్తం’ చిత్రంతో రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు.  మళయాలంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించిన ‘నడొడికట్టు’ అనే చిత్రం రాజుకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆయన చివరి  2017లో వచ్చిన ‘మాస్టర్‌పీస్‌’. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.

Comments

comments

Related Stories: