చివరి వన్డేలో లంక గెలుపు

కొలంబో: భారత్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో శ్రీలంక మహిళా జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఎఫ్‌టిజెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఆఖరి వన్డలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మరో బంతి మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన […]

కొలంబో: భారత్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో శ్రీలంక మహిళా జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఎఫ్‌టిజెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఆఖరి వన్డలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మరో బంతి మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన చమరి ఆటపట్టు అద్భుత సెంచరీతో లంకకు విజయాన్ని అందించింది. మరో ఓపెనర్ హాసిని పెరీరాతో కలిసి చమరి జట్టుకు శుభారంభం అందించింది. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హాసిని 4 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసింది.

ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరినా ఆటపట్టు తన పోరాటాన్ని కొనసాగించింది. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఆటపట్టు 133 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను కెప్టెన్ మిథాలీ రాజ్ అజేయ శతకంతో ఆదుకుంది. లంక బౌలర్లను హడలెత్తించిన మిథాలీ పరుగుల వర్షం కురిపించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ 145 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 125 పరుగులు చేసింది. మరోవైపు స్మృతి మందన (51) ఆమెకు అండగా నిలిచింది. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. చివర్లో దీప్తి శర్మ (38) రాణించడంతో భారత్ స్కోరు 253కు చేరింది.

Comments

comments

Related Stories: