ప్రత్యేక గీతంలో పూర్ణ

రవిబాబు తెరకెక్కిస్తున్న ‘అదుగో’ సినిమాలో నటి పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఈ పాట ఈనెల 17న విడుదలకానుంది. ఈ పాటలో పూర్ణతో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా పాటలోని పూర్ణ స్టిల్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. దసరా […]

రవిబాబు తెరకెక్కిస్తున్న ‘అదుగో’ సినిమాలో నటి పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఈ పాట ఈనెల 17న విడుదలకానుంది. ఈ పాటలో పూర్ణతో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. ఈ సందర్భంగా పాటలోని పూర్ణ స్టిల్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో విడుదలకానుంది ‘అదుగో’. ఇతర భాషల్లోకి కూడా అనువాదం చేసి భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం విడుదల కానుంది. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటర్‌ః బల్ల సత్యనారాయణ, ఆర్ట్‌ః నారాయణరెడ్డి, యాక్షన్‌ః కనల్ కణ్ణన్, విజయ్, సతీష్, పాటలుః భాస్కరభట్ల, మాటలుః రవిబాబు, నివాస్.

Comments

comments

Related Stories: