సొంతంగా సినిమాలు నిర్మిస్తా

అక్కినేని ఇంటి కోడలు సమంత కూడా నిర్మాతగా మారుతుందని ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఆమె సినిమాలు నిర్మిస్తుందని అన్నారు. అయితే తను నిర్మాతగా మారే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది సమంత. తన మనసులో మాటను ఆమె బయటపెట్టింది. సమంత మాట్లాడుతూ “సినిమాలు నిర్మించాలని ఉంది. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించను. నా డబ్బుతో నేను సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను. నా సినిమాను స్క్రీన్‌పై చూసుకోవాలని ఉంది”అని పేర్కొంది. […]

అక్కినేని ఇంటి కోడలు సమంత కూడా నిర్మాతగా మారుతుందని ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఆమె సినిమాలు నిర్మిస్తుందని అన్నారు. అయితే తను నిర్మాతగా మారే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది సమంత. తన మనసులో మాటను ఆమె బయటపెట్టింది. సమంత మాట్లాడుతూ “సినిమాలు నిర్మించాలని ఉంది. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించను. నా డబ్బుతో నేను సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను. నా సినిమాను స్క్రీన్‌పై చూసుకోవాలని ఉంది”అని పేర్కొంది. ఇక నాగార్జున, నాగచైతన్య సహకారం లేకుండా తన సొంత డబ్బులతో సినిమాలను నిర్మిస్తానంటోంది సమంత. అక్కినేని కుటుంబంలో తనకు ఆ స్వేచ్ఛ ఉందని చెబుతోంది. తను నిర్మించే సినిమాలతో కొత్త వాళ్లను ప్రోత్సహిస్తానని చెప్పింది. “కొత్త వాళ్లతో సినిమాలు తీస్తాను. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తా. అయితే నిర్మాతగా మారేందుకు కొంత సమయం ఉంది. నటిగా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే యు టర్న్, రాజుగారి గది-2 వంటి సినిమాలతో కొత్త జర్నీని ప్రారంభించాను”అని సమంత పేర్కొంది.

Related Stories: