వీడియో జర్నలిస్టుగా పూజ

దసరాకు విడుదలకానున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మొదటిసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇక టైటిల్‌లో కూడా హీరోయిన్ పేరు ప్రముఖంగా ఉండడంతో పూజ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే వీడియో జర్నలిస్టుగా కనిపిస్తుందట. ఉండేది విదేశాలలో అయినప్పటికీ రాయలసీమ నేపథ్యంలో ఒక డాక్యుమెంటరీని […]

దసరాకు విడుదలకానున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మొదటిసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇక టైటిల్‌లో కూడా హీరోయిన్ పేరు ప్రముఖంగా ఉండడంతో పూజ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే వీడియో జర్నలిస్టుగా కనిపిస్తుందట. ఉండేది విదేశాలలో అయినప్పటికీ రాయలసీమ నేపథ్యంలో ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించేందుకు ఇండియా వస్తుందట. సీమలో అడుగుపెట్టిన ఆమెకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయట. ఆ ఊహించని సంఘటనలు ఏమిటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక పూజ పాత్ర గ్లామర్‌తో పాటు కామెడీ కూడా పంచుతుందట. ముఖ్యంగా సునీల్‌తో కలిసి ఆమె నవ్విస్తుందని తెలిసింది. ఎన్టీఆర్‌కు సీమగురువు పాత్రలో సునీల్ కనిపిస్తాడని సమాచారం.