క్రైమ్ థ్రిల్లర్

నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియా, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయులు’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు ఫిల్మ్‌మేకర్స్.  బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ […]

నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియా, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయులు’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు ఫిల్మ్‌మేకర్స్.  బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తుండగా… ఎస్.వెంకట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రాఫర్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ః శశాంక్ మాలి, ఆర్ట్‌ః శ్రీకాంత్ రామిశెట్టి.