యశ్‌చోప్రా జయంతికి ట్రైలర్

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌కు దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. దశాబ్దంన్నర సినీ ప్రయాణంలో అతను ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అమీర్ నటించిన ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆతర్వాత అమీర్‌ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా దాదాపుగా పూర్తికావచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ కాలేదు. అయితే నేరుగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారట. […]

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌కు దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. దశాబ్దంన్నర సినీ ప్రయాణంలో అతను ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అమీర్ నటించిన ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆతర్వాత అమీర్‌ఖాన్ నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం చడీచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా దాదాపుగా పూర్తికావచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ కాలేదు. అయితే నేరుగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారట. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఈనెల 27న యశ్‌చోప్రా జయంతి సందర్భంగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. 1839లో వచ్చిన ఒక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.