‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి

హైదరాబాద్: తనదైన హావభావాలతో తీన్ మార్ వార్తలతో నవ్వించే బిత్తిరి సత్తి హీరోగా నటిస్తున్న ‘తుపాకీ రాముడు’తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తీన్మార్ వార్తలతో పాపులర్ అయిన సత్తి ఇటీవల కొన్ని చిత్రాల్లో కమెడిన్ గా కూడా నటించాడు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను […]

హైదరాబాద్: తనదైన హావభావాలతో తీన్ మార్ వార్తలతో నవ్వించే బిత్తిరి సత్తి హీరోగా నటిస్తున్న ‘తుపాకీ రాముడు’తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ‘బతుకమ్మ’ ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తీన్మార్ వార్తలతో పాపులర్ అయిన సత్తి ఇటీవల కొన్ని చిత్రాల్లో కమెడిన్ గా కూడా నటించాడు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మోషన్ పోస్టర్‌, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుక్కు మాట్లాడుతూ ‘బిత్తిరి సత్తిగా అందరికీ పరిచయమైన సత్తి.. తుపాకీ రాముడు చిత్రంలో మరో కోణంలో కనిపించనున్నారని, ఈ మూవీ సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయని, సత్తిని ఈ మూవీలో వైవిధ్య కోణంలో చూపిస్తున్నామని చిత్ర దర్శకుడు ప్రభాకర్ అన్నారు. అలాగే నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. సత్తిని మా బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ మూవీ సత్తికి మంచి పేరునే కాకుండా బిజీ నటుడిని కూడా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Telangana Breaking News

Comments

comments