నాట్ ఇంట్రెస్టెడ్: శ్రీరెడ్డి

హైదరాబాద్: గత కొంతకాలంగా వర్ధమాన నటి శ్రీరెడ్డి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సంగతి తెలిసిందే. అవకాశాల పేరుతో సినీ పెద్దలు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనేది ఆమె వాదన. ఈ నేపథ్యంలో ఆమె తరచూ వార్తలో నిలుస్తుంది. తాజాగా తెలంగాణలో రాజకీయాలు వెడేక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీరెడ్డికి రాజకీయాలపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె  ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. సైదాబాద్‌లో ఓ బేకరి ఓపెనింగ్ కు […]

హైదరాబాద్: గత కొంతకాలంగా వర్ధమాన నటి శ్రీరెడ్డి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సంగతి తెలిసిందే. అవకాశాల పేరుతో సినీ పెద్దలు అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనేది ఆమె వాదన. ఈ నేపథ్యంలో ఆమె తరచూ వార్తలో నిలుస్తుంది. తాజాగా తెలంగాణలో రాజకీయాలు వెడేక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీరెడ్డికి రాజకీయాలపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె  ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. సైదాబాద్‌లో ఓ బేకరి ఓపెనింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. తనను రెండు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానం అందిందని,  అయితే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పింది. అలాగే సోషల్‌ మీడియాలో గత కొంతకాలంగా తాను రాజకీయాలలో వస్తున్నట్లు వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఎపిలో రాబోయే ఎన్నికలలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు పరాభవం తప్పదని శ్రీరెడ్డి తెలిపింది . మహా అయితే మూడు, నాలుగు సీట్లకు మాత్రమే గెలవొచ్చని ఆమె జోస్యం చెప్పింది. తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Comments

comments