దర్శకుడు కెఎన్‌టి శాస్త్రి మృతి

సీనియర్ దర్శకుడు కెఎన్‌టి శాస్త్రి (70) కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న పలు తెలుగు, కన్నడ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.ఆరు జాతీయ అవార్డులు, నంది అవార్డులను అందుకున్నారు కెఎన్‌టి శాస్త్రి. అదేవిధంగా బెస్ట్ క్రిటిక్‌గా జాతీయ అవార్డు సైతం ఆయనకు దక్కింది. తిలాదానం, కమ్లి, సురభి, స్నేహాన్వేషణ, స్నేహ గీత వంటి విభిన్నమైన చిత్రాలను ఆయన రూపొందించారు.  ఆయన చివరి చిత్రం ‘షాను’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అంతర్జాతీయ చలన […]

సీనియర్ దర్శకుడు కెఎన్‌టి శాస్త్రి (70) కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న పలు తెలుగు, కన్నడ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.ఆరు జాతీయ అవార్డులు, నంది అవార్డులను అందుకున్నారు కెఎన్‌టి శాస్త్రి. అదేవిధంగా బెస్ట్ క్రిటిక్‌గా జాతీయ అవార్డు సైతం ఆయనకు దక్కింది. తిలాదానం, కమ్లి, సురభి, స్నేహాన్వేషణ, స్నేహ గీత వంటి విభిన్నమైన చిత్రాలను ఆయన రూపొందించారు.  ఆయన చివరి చిత్రం ‘షాను’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఆయన చిత్రాలు పలు అవార్డులు గెల్చుకున్నాయి.

Comments

comments