విభిన్న పాత్రలే మంచి నటిగా నిలబెట్టాయి

మలిచిన విధానం బాగుంది… సినిమాలో నేను చేసిన శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఒకవైపు ఊరులో ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఎంతవరకై నా పోరాడే ధీరత్వం… మరోవైపు తల్లిగా కూ తురు మీద ప్రేమ, ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే పాత్ర నాది. మారుతి ఈ పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది. కొత్త అత్త, అల్లుడిని చూస్తారు… ఇందులో అత్త పాత్ర రెగ్యులర్‌గా ఉండదు. ఇప్పటివరకు చూసిన అత్త, అల్లుడి మధ్య కామెడీ ఈ […]

మలిచిన విధానం బాగుంది…
సినిమాలో నేను చేసిన శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఒకవైపు ఊరులో ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఎంతవరకై నా పోరాడే ధీరత్వం… మరోవైపు తల్లిగా కూ తురు మీద ప్రేమ, ఎంతటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే పాత్ర నాది. మారుతి ఈ పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది.

కొత్త అత్త, అల్లుడిని చూస్తారు…
ఇందులో అత్త పాత్ర రెగ్యులర్‌గా ఉండదు. ఇప్పటివరకు చూసిన అత్త, అల్లుడి మధ్య కామెడీ ఈ చిత్రంలో కనిపించదు. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతులను అందించే చిత్రమిది. సినిమాలోని సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. కొత్త అత్త, అల్లుడిని చూస్తారు.

ఎంజాయ్ చేస్తూ నటించా…
సినిమాలో అత్తగా నాకు, నా కూతురికి ఇగో ఉంటుంది. నా పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నటించాను. మా ఇద్దరి మధ్య చైతన్య పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా నరేష్, పృథ్వి, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కామెడీగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తాయి.

చక్కగా నటించాడు…
ఒకప్పుడు నాగార్జున, ఇప్పుడు నాగచైతన్యతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నాగచైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్. అతను నటనలో మంచి పరిణతి కనబరుస్తున్నాడు. సినిమాలో ముఖ్యంగా నన్ను, అను ఇమ్మాన్యుయల్‌ని సర్దిచెప్పే సన్నివేశంలో అతను చక్కగా నటించాడు.

అతనికి మంచి భవిష్యత్తు ఉంది…
దర్శకుడు మారుతి వేగంగా పనిచేస్తారు. ఒక రోజు వర్షం పడుతుంటే షూటింగ్ ఆపేస్తారని అనుకున్నా. కానీ ఆ గ్యాప్‌లో కూడా షూటింగ్ చేశారు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. నా కెరీర్‌లో ఇంత వేగంగా షూటింగ్ చేసి విడుదల చేసిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’ మాత్రమే.

మరింతగా ఆదరించాలని…
చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈమధ్య కాలంలో ఇటువంటి మంచి చిత్రం రాలేదు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను.

మంచి ప్రశంసలు…
‘బాహుబలి’ చిత్రంతో మంచి నటిగా నాకు దేశవ్యాప్తంగా పేరువచ్చింది. ఇప్పుడు అత్త పాత్రలో నా నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నేను చేసిన విభిన్న పాత్రలే నన్ను మంచి నటిగా నిలబెట్టాయి. ఇకముందు కూడా ఇలాంటి పాత్రలే చేస్తా.

Comments

comments