ఎస్‌సీ,ఎస్‌టీ స్కాలర్‌షిప్‌లు…

మన దేశంలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థినులకు సంతూర్, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి అయి, డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంతూర్ నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. ఓఎన్‌జీసీ ప్రకటన ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశముంది. సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విప్రో కన్సూమర్ కేర్ అండ్ విప్రోకేర్ అందిస్తోంది. 12/ఇంటర్మీడియట్ తరువాత ఉన్నతవిద్యను హ్యుమానిటీస్, లిబరల్ ఆరట్స్ అండ్ సైన్సెస్‌లో అభ్యసించేవారికి అందిస్తారు. ఏటా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 900 […]

మన దేశంలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థినులకు సంతూర్, ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి అయి, డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంతూర్ నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. ఓఎన్‌జీసీ ప్రకటన ఈ నెలాఖరుకు విడుదలయ్యే అవకాశముంది. సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విప్రో కన్సూమర్ కేర్ అండ్ విప్రోకేర్ అందిస్తోంది. 12/ఇంటర్మీడియట్ తరువాత ఉన్నతవిద్యను హ్యుమానిటీస్, లిబరల్ ఆరట్స్ అండ్ సైన్సెస్‌లో అభ్యసించేవారికి అందిస్తారు. ఏటా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 900 మందిని ఎంపిక చేస్తారు. వెనుకబడిన జిల్లాలవారికి ప్రాధాన్యమిస్తారు.

అర్హత: పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేసుండాలి. 2017-18 సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్/ డిప్లొమా ప్రభుత్వ కళాశాలలో పూర్తిచేసుండాలి. 2018-19 విద్యాసంవత్సరానికి గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ డిప్లొమాకు నమోదు చేసుకుని ఉండాలి.
చదువు, దానికి సంబంధించిన ఇతర ఖర్చులకు కలిపి కోర్సు పూర్తయ్యేనాటికి ఏడాదికి రూ.24,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఎలా?
మెయిల్, ఫేస్‌బుక్ ఐడీలతో రిజిస్టర్ చేసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని నింపి, అవసరమైన పత్రాలను జతచేసి, విప్రో కేర్స్, సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డ కన్నెల్లి, సర్జాపూర్‌రోడ్, బెంగళూరు- 560035 కు పంపాల్సి ఉంటుంది. ఎంపికైనవారిని తరువాత ప్రకటిస్తారు.
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబరు 15, 2018
వెబ్‌సైట్: santoorscholarships.com

Comments

comments

Related Stories: