చాక్లెట్టా.. మజాకా!

సెప్టెంబర్ 13న  ఇంటర్నేషనల్ చాక్లెట్ డే ! చాక్లెట్… ఇష్టపడని వారు ఉండరు, అంటే తినని వారు ఉండరు, పిల్లలకయితే చిన్న, పెద్ద చాక్లెట్‌లు ఇచ్చి వారిని ఏడుపు మానిపిస్తూ ఉంటాం. చాక్లెట్ అన్నివయసుల వారు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదేమో. దుకాణానికి వెళ్లి కిట్‌క్యాట్ కొంటే దుకాణదారుడు దాన్ని అద్దాల బాక్స్‌లోంచి తీసి ఇస్తాడు. మనం డబ్బు ఇచ్చి అంతే వేగంగా చాక్లెట్ నోట్లో పెట్టేసుకుంటాం. పళ్లులేని ముసలివాళ్లు సైతం మెత్తని చాక్లెట్‌ను చూస్తే ఫిదా అయిపోతారనడంలో […]

సెప్టెంబర్ 13న  ఇంటర్నేషనల్ చాక్లెట్ డే !

చాక్లెట్… ఇష్టపడని వారు ఉండరు, అంటే తినని వారు ఉండరు, పిల్లలకయితే చిన్న, పెద్ద చాక్లెట్‌లు ఇచ్చి వారిని ఏడుపు మానిపిస్తూ ఉంటాం. చాక్లెట్ అన్నివయసుల వారు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదేమో. దుకాణానికి వెళ్లి కిట్‌క్యాట్ కొంటే దుకాణదారుడు దాన్ని అద్దాల బాక్స్‌లోంచి తీసి ఇస్తాడు. మనం డబ్బు ఇచ్చి అంతే వేగంగా చాక్లెట్ నోట్లో పెట్టేసుకుంటాం. పళ్లులేని ముసలివాళ్లు సైతం మెత్తని చాక్లెట్‌ను చూస్తే ఫిదా అయిపోతారనడంలో సందేహం లేదు. అబ్బాయిలు తమ పట్ల కోపంగా ఉన్న అమ్మాయిలకు ఒక చాక్లెట్ ఇచ్చి ఇంప్రెస్ చేసేస్తారు. అమ్మాయిలు స్వీట్ గా మాట్లాడటానికి కారణం చాక్లెట్లు తినడమేనట. ఇక మిగతా దేశాల్లో అయితే సరేసరి. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారు బహుమతులుగా ఎక్కువ చాక్లెట్లే తెస్తారు.

చాక్లెట్స్ మోడ్రన్‌గా కనిపిస్తాయి గానీ వాటివెనుక మూడువేల సంవత్సరాల నేపథ్యం ఉంది. మొదటగా ఆజ్‌టెక్‌లు కోకో వాడుకను మొదలుపెట్టారు. వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని వారి నమ్మకం. వీటిని కరెన్సీగా ఉపయోగించేవారట. వీటి గొప్పతనం చాలాకాలం ఎవరికీ తెలీలేదు. కొలంబస్ క్రీ.శ. 1502 లో అమెరికా వెళ్లినప్పుడు కోకోతో తయారు చేసిన పానీయాన్ని సేవించాడు. క్రమంగా మిగిలిన యురోపియన్ ప్రాంతాలకు విస్తరించింది. ఘనరూపంలో తయారుచేయడం, చాక్లెట్‌బార్లు లాంటివి తయారుచేసి నిల్వ ఉంచటం మొదలైంది.

కళాపోషకులు చాక్లెట్ కళాకృతులు తయారుచేస్తున్నారు. ఇప్పుడు ఇంటిలోనే సులభంగా కూడా చాక్లెట్స్‌ను తయారు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం కోకో ఉత్పత్తిలో పశ్చిమాఫ్రికా దేశాలే అగ్రస్థానంలో ఉన్నాయి. డార్క్ చాక్‌లెట్స్, మిల్క్ చాక్‌లెట్స్, కాజు, ఆల్మండ్, వైట్ చాక్‌లెట్స్, పౌడర్ చాక్లెట్, చాక్లెట్ లిక్కర్, చాక్లెట్ బటర్, కారామిల్, సీసాల్ట్, ఎక్స్‌ట్రా డార్క్ ఇలా వివిధ రుచులతో చాక్లెట్స్ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. రకరకాల రూపాల్లో, రంగుల్లో చూపరులను ఇట్టే ఆకర్షించే చాక్లెట్ లోని పోషకాల గురించి తెలుసుకుందాం…

International Chocolate Day,Telangana news,Telangana breaking news

Comments

comments