జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో రేవంత్‌రెడ్డికి నోటీసులు

మన తెలంగాణ/ హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డితో పాటు 13 మందిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో 2002లో నమోదైన కేసు తాజాగా తెరమీదకు వచ్చింది. 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హై కోర్టు జోక్యం చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును తిరగదోడారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు 13 మందికి సిఆర్‌పిసి 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. 15 […]

మన తెలంగాణ/ హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డితో పాటు 13 మందిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో 2002లో నమోదైన కేసు తాజాగా తెరమీదకు వచ్చింది. 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హై కోర్టు జోక్యం చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును తిరగదోడారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు 13 మందికి సిఆర్‌పిసి 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తాను ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరు కాలేనని జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసు నాన్‌బెయిలబుల్ కావడంతో అరెస్టు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు.

అక్రమంగా ప్లాట్లు అమ్ముకున్నారు : ‘జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ’ జూబ్లీహిల్స్ ప్రాంతంలో లేఔట్ చేసి సభ్యులకు ప్లాట్లు విక్రయించింది. లేఔట్ చేసే సమయంలో నిబంధనల మేరకు పార్కులు, పాఠశాల, దేవాలయాలకు స్థలాలను కేటాయించారు. ఇలా కేటాయించిన స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా గుర్తింపు పొందుతాయి. ఈ స్థలాలు ఖాళీగానే ఉన్నా యి. వీటిపై ఈ సొసైటీలో నాయకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి కన్నుపడింది. ఇంకేముంది ఈ స్థలాలను అక్రమంగా ఏడుగురికి విక్రయించారు.

నకిలీ బ్యాంక్ ఖాతా : ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసుకున్న రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ పేరుతో నకిలీ బ్యాంక్ ఖాతాను తెరిచాడు. ఏడుగురికి భూములను విక్రయించగా డిడిల రూపంలో వచ్చిన డబ్బును నకిలీ బ్యాంక్ ఖాతాలో వేసుకుని డ్రా చేసుకుని రేవంత్‌రెడ్డితో పాటు 13 మంది వాడుకున్నారు. ఈ విషయంపై బయటికి పొక్కడంతో రిజిస్టర్ కో-ఆపరేటివ్ సొసైటీ అధికారి ఒకరు విచారణకు ఆదేశించారు. విచారణలో రేవంత్‌రెడ్డి అక్రమంగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఏడు ప్లాట్లను విక్రయించాడని నివేదిక తేలింది. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా రిజిస్టర్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయానికి అందాయి. దీంతో జాయింట్ రిజిస్టర్ కో-ఆపరేటివ్ సొసైటీస్ మరియు జూబ్లీహిల్స్ బిల్డింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్ అమరేందర్‌రావు 2002లో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరేందర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నెంబర్ 326/2002పై సరళ, ఆర్ ప్రసద్, సురేష్ నల్లారి, జి.నర్సింహ్మారావు, టి.ఎల్.ప్రసాద్, వై.గౌరి, వి.సుమిత్రారెడ్డి, ఎం.జయశ్రీ రెడ్డి, బి.వరలక్ష్మి, జగ్గారావు, హర్ష వర్ధన్‌రెడ్డి, ఇటిక్యాల విష్ణురావు, రేవంత్‌రెడ్డిలపై ఐపిసి 468, 471, 406, 120 (బి) సెక్షన్‌లతో పాటు 82 కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

16 ఏళ్లుగా హైకోర్టులో : కేసు నమోదు అయిన విషయం తెలియగానే రేవంత్‌రెడ్డి హైకోర్టులో 2002లోనే రిట్‌పిటిషన్ వేశాడు. దీంతో అతనిపై నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు 326/2002 క్రైమ్ నెంబర్ దర్యాప్తును నిలిపివేశారు. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ న్యాయవాది ఇమ్మానేని రామారావు 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వర్‌రావు స్టే ఆర్డర్ ఎత్తివేశారు. ఈ కేసులో నిందితులపై అన్ని ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తులు నిలపడం భావ్యం కాదని, కేసులో నిందితులపై తదుపరి విచారణ జరిపి చార్జీషీట్ దాఖలు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తమపై తిరిగి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి అదే ఏడాది హైకోర్టులో కేసు దర్యాప్తును నిలిపివేయాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నాలుగేళ్లుగా వాదోపవాదనల అనంతరం రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రేవంత్‌రెడ్డిపై పోలీసులు దర్యాప్తు చేసి చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉండగా ఆ దిశగా పోలీసులు పావులు కదపలేదు. దీన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది మేలో రామారావు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.

క్రైమ్ నెంబర్ 326/2002లో నిందితుల అభియోగాలు నిరూపించేందుకు అన్ని డాక్యుమెంట్లు ఉనా పోలీసులు పట్టించుకోవడం లేదని, అలాగే కోర్టులో ఉన్న పెండింగ్ ఫైల్‌ను కోర్టుకు తప్పుడు నివేదికలు అందించి మాయం చేయించారని, పోలీసులు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో రామారావు కోరారు. మరోపక్క పిటిషన్‌లో ఉన్న అంశాలపైనే రామారావు జూన్ 14న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌రెడ్డిపై మరో ఫిర్యాదు చేశారు. హైకోర్టు రామారావు పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంటున్న తరుణంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో 12 మందికి 41 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేశారు. రేవంత్‌రెడ్డిపై అభియోగాలు రుజువైతే ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డిపై నమోదైన ఐపిసి సెక్షన్‌లన్ని కూడా నాన్‌బెయిలబుల్ కేసులే. అయితే తాను ఎన్నికల కార్యక్రమంలో బిజీగా ఉన్నాని విచారణకు రాలేనని పోలీసులకు రేవంత్ లేఖ రాశాడు. అయితే పోలీసుల ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. రేవంత్‌రెడ్డికి జారీ చేసిన నోటీసులో పోలీసుల ముందు 15 రోజులలో హాజరు కావాలని పేర్కొన్నారు. ఒకవేల్ల రేవంత్ హాజరైనా, కాకున్నా చట్టప్రకారం అతను అరెస్టుకు హర్హుడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: