జమ్మూ, హర్యానాలో స్వల్ప భూకంపం..!

న్యూఢిల్లీ: జమ్మూతో పాటు హర్యానాలో బుధవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. కశ్మీర్‌లో తెల్లవారుజామున 5:15 గంటల సమయంలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించగా, రిక్టర్ స్కేలుపై దాన్ని తీవ్రత 4.6గా నమోదైంది. అలాగే హర్యానాలోని జాజ్జర్‌లో కూడా ఉదయం 5:43 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం గాని, నష్టం గానీ సంభవించలేదని సంబంధిత అధికారులు […]

న్యూఢిల్లీ: జమ్మూతో పాటు హర్యానాలో బుధవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. కశ్మీర్‌లో తెల్లవారుజామున 5:15 గంటల సమయంలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించగా, రిక్టర్ స్కేలుపై దాన్ని తీవ్రత 4.6గా నమోదైంది. అలాగే హర్యానాలోని జాజ్జర్‌లో కూడా ఉదయం 5:43 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రమాదం గాని, నష్టం గానీ సంభవించలేదని సంబంధిత అధికారులు తెలిపారు.

Comments

comments

Related Stories: