ప్రపంచ జిడిపిలో అవినీతి 5శాతం

న్యూయార్క్: అవినీతి మూల్యం ఎంతలేదన్న కనీసం 2.6 ట్రిలియన్ అమెరికా డాలర్లు లేక ప్రపంచ స్థూలజాతీమోత్పత్తి(జిడిపి)లో 5 శాతం ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అక్రమ నగదు చలామణి(మనీ లాండరింగ్), పన్ను ఎగవేత, అక్రమమార్గంలో ధన ప్రవాహంకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం పనిచేయాలని ఆయన కోరారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం వ్యక్తులు, వ్యాపార సంస్థలు ప్రతి ఏడాది 1 ట్రిలియన్ అమెరికా డాలర్లను లంచంగా ఇస్తున్నారు. శాంతికి, అంతర్జాతీయ భద్రతకు అవినీతిని అరికట్టాలని […]

న్యూయార్క్: అవినీతి మూల్యం ఎంతలేదన్న కనీసం 2.6 ట్రిలియన్ అమెరికా డాలర్లు లేక ప్రపంచ స్థూలజాతీమోత్పత్తి(జిడిపి)లో 5 శాతం ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అక్రమ నగదు చలామణి(మనీ లాండరింగ్), పన్ను ఎగవేత, అక్రమమార్గంలో ధన ప్రవాహంకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం పనిచేయాలని ఆయన కోరారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం వ్యక్తులు, వ్యాపార సంస్థలు ప్రతి ఏడాది 1 ట్రిలియన్ అమెరికా డాలర్లను లంచంగా ఇస్తున్నారు. శాంతికి, అంతర్జాతీయ భద్రతకు అవినీతిని అరికట్టాలని ఆంటోనియో సోమవారం ఒక సమావేశంలో చెప్పారు. ‘పేద ధనిక, ఉత్తర దక్షిణ, అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందని  వంటి అన్ని దేశాల్లో అవినీతి ఉంది. అవినీతి ఆశ్చర్యపరిచే సంఖ్యల్లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం అవినీతి ఎంతలేదన్న కనీసం 2.6 ట్రిలియన్ అమెరికా డాలర్లు, లేక ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 5 శాతం ఉంది. భద్రతా మండలి అవినీతిపై చేపట్టిన సమావేశానికి అమెరికా రాయబారి నిక్కీ హేలీ అధ్యక్షత వహించారు. తమ అవినీతి నాయకులపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, సమాజంలో అవినీతి ఎంతలా పాతుపోయిందో గుటెరస్ వివరించారు. అవినీతి సంస్థలు కుళ్లి పోయేలా, అధికారులు సంపన్నులయ్యేలా, ప్రజల హక్కులు దోచుకునేలా, విదేశీ పెట్టుబడి రాకుండా పనిచేస్తోందన్నారు. అవినీతికి పేదలే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ ప్రతి 10 దేశాల్లో 9 అవినీతి దేశాలేనని ట్రాన్సరెన్సీ ఇంటరేషనల్ భావిస్తోందన్నారు.

Related Stories: