జియో వినియోగదారులకు శుభవార్త…

న్యూఢిల్లీ: జియో ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇక జియో 4జి ఫీచర్‌ ఫోన్లలోనూ వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా తొలిసారి జియో ఫోన్లలో వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తాజాగా వెల్లడించారు. నిజానికి ఆగస్టు 15 నుంచే వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కాగా, కొన్నిసాంకేతికపరమైన కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. నిజానికి జియో ఫోన్లు కైఓఎస్‌తో పనిచేస్తాయి. కాబట్టి వాటిలోనూ వాట్సాప్, యూట్యూబ్ […]

న్యూఢిల్లీ: జియో ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇక జియో 4జి ఫీచర్‌ ఫోన్లలోనూ వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా తొలిసారి జియో ఫోన్లలో వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తాజాగా వెల్లడించారు. నిజానికి ఆగస్టు 15 నుంచే వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కాగా, కొన్నిసాంకేతికపరమైన కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. నిజానికి జియో ఫోన్లు కైఓఎస్‌తో పనిచేస్తాయి. కాబట్టి వాటిలోనూ వాట్సాప్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లు పనిచేసేలా యాప్‌ను అభివృద్ధి చేశారు. వాట్సాప్ కావాలనుకున్నయూజర్లు జియో యాప్‌ స్టోర్‌లోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 20 నుంచి వాట్సాప్ అందుబాటులో ఉంటుందని జియో సంస్థ తెలిపింది.

Comments

comments

Related Stories: