త్వరలో బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలు..!

హైదరాబాద్: దేశీయ టెలికాం మార్కెట్‌లో ఇప్పటికే పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు 4జి సేవలను ప్రారంభించి చాలా రోజులవుతుండగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జిలోనే ఉండిపోయింది. అయితే, బిఎస్‌ఎన్‌ఎల్ తన నెట్‌వర్క్‌లో 4జి సేవలను త్వరలో ప్రారంభించబోతుందని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి సేవలను ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులను జారీ చేసింది. 2100 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ తన 4జి సేవలను ప్రారంభించనుంది. 2017లోనే ఇందుకు, బిఎస్‌ఎన్‌ఎల్ […]

హైదరాబాద్: దేశీయ టెలికాం మార్కెట్‌లో ఇప్పటికే పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు 4జి సేవలను ప్రారంభించి చాలా రోజులవుతుండగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇంకా 3జిలోనే ఉండిపోయింది. అయితే, బిఎస్‌ఎన్‌ఎల్ తన నెట్‌వర్క్‌లో 4జి సేవలను త్వరలో ప్రారంభించబోతుందని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి సేవలను ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులను జారీ చేసింది. 2100 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ తన 4జి సేవలను ప్రారంభించనుంది. 2017లోనే ఇందుకు, బిఎస్‌ఎన్‌ఎల్ ప్రాజెక్టు రిపోర్టును సబ్‌మిట్ చేసింది. అయితే, ఇప్పుడు అందుకు ఆమోదం లభించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో త్వరలో బిఎస్‌ఎన్‌ఎల్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (ఎల్‌టిఇ) సేవలను ఆరంభించనుంది. తాజాగా లభించిన అనుమతితో త్వరలో దేశంలోని 21 సర్కిళ్లలో బిఎస్‌ఎన్‌ఎల్ తన 4జి సేవలను ప్రారంభిస్తుంది. కేరళ, కర్నాటకలలోని పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 4జి సేవలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో డాట్ నుంచి వచ్చిన అనుమతి వల్ల భారత్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ 4జి సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Comments

comments

Related Stories: