అటు బంద్…ఇటు ఠారెత్తిస్తున్న ఇంధన ధరలు

పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసల తాజా పెంపు న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం ‘భారత్ బంద్’ నిర్వహించాయి. అయినప్పటికీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మాత్రం ఎప్పటిలీ పెరిగాయి. బంద్ రోజున కూడా లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.73కు, లీటర్ డీజిల్ ధర రూ. 72.83 రికార్డు స్థాయికి […]

పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసల తాజా పెంపు

న్యూఢిల్లీ: రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు దేశవ్యాప్తంగా సోమవారం ‘భారత్ బంద్’ నిర్వహించాయి. అయినప్పటికీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మాత్రం ఎప్పటిలీ పెరిగాయి. బంద్ రోజున కూడా లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.73కు, లీటర్ డీజిల్ ధర రూ. 72.83 రికార్డు స్థాయికి చేరుకుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలకన్నా ఢిల్లీలోనే ఇంధన ధరలు చవుక. ఎందుకంటే అక్కడ సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఇష్టపడ్డంలేదని, తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి.

ఆగస్టు నుంచి లీటరు పెట్రోల్‌పై రూ. 3.65, లీటరు డీజిల్‌పై 4.06 మేరకు పెరిగాయి. ఈ రెండు ఇంధన అమ్మకం ధరల్లో సగం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలే ఉన్నాయి. కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ. 19.48, డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఇక రాష్ట్రాలు విలువ ఆధారిత సుంకం(వ్యాట్)ను విధిస్తున్నాయి. అయితే అండమాన్, నికోబార్‌లో ఈ రెండు ఇంధనాల అమ్మకం ధరపై వ్యాట్ అత్యంత తక్కువగా 6 శాతమే ఉంది. కాగా అత్యధికంగా ముంబయిలో పెట్రోల్‌పై వ్యాట్ 39.12 శాతం, తెలంగాణలో డీజిల్‌పై వ్యాట్ 26 శాతం ఉన్నాయి. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 88.12, లీటరు డీజిల్ ధర 77.32గా ఉంది. కాగా హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ. 85.60, డీజిల్ ధర రూ. 79.22గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తేవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments

Related Stories: