రూపీ మరింత వీక్

75 పైసల మేరకు పతనం ముంబయి: అమెరికా డాలరుతో పోల్చినప్పుడు సోమవారం రూపాయి విలువ 75 పైసలు తగ్గి రూ. 72.48కు పడిపోయింది. దీంతో డాలరు విలువ మరింత బలపడ్డం, కరెంట్ ఖాతా లోటు బాగా విస్తరించడం, ముడిచమురు విలువ పెరిగిపోవడం వంటివన్నీ సోమవారం రూపాయి బలహీనపడ్డానికి కారణమయ్యాయి. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజిలో రూపాయి మారక విలువ రూ. 72.074 నుంచి 72.48 మధ్య కదలాడింది. భారత కరెంటు ఖాతా లోటు(సిఎడి) ఏప్రిల్‌జూన్ మధ్య 15.8 […]

75 పైసల మేరకు పతనం

ముంబయి: అమెరికా డాలరుతో పోల్చినప్పుడు సోమవారం రూపాయి విలువ 75 పైసలు తగ్గి రూ. 72.48కు పడిపోయింది. దీంతో డాలరు విలువ మరింత బలపడ్డం, కరెంట్ ఖాతా లోటు బాగా విస్తరించడం, ముడిచమురు విలువ పెరిగిపోవడం వంటివన్నీ సోమవారం రూపాయి బలహీనపడ్డానికి కారణమయ్యాయి. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజిలో రూపాయి మారక విలువ రూ. 72.074 నుంచి 72.48 మధ్య కదలాడింది. భారత కరెంటు ఖాతా లోటు(సిఎడి) ఏప్రిల్‌జూన్ మధ్య 15.8 బిలియన్ అమెరికా డాలర్లకు విస్తరించింది. గత సంవత్సరం(201718) ఇదే త్రైమాసికంలో 15 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశీయ స్థూల(మ్యాక్రో) పరిస్థితి, డాలరు విలువ బలపడిన నేపథ్యంలో రూపాయి పతనం కొనసాగుతోందని, దీనివల్ల కరెన్సీ సంక్షోభం ఏర్పడుతోందని ఓ ఫారిన్ ఎక్సేంజి డీలరు అభిప్రాయపడ్డాడు. అమెరికా ఆగస్ట్ జాబ్ డేటా, అమెరికాచైనా మధ్య వాణిజ్య యుద్ధ భయం డాలరు విలువ పెరగడానికి దోహదపడింది.

Comments

comments

Related Stories: