ఈసారి బిగ్ బాస్ ఎవరో?

బిగ్‌బాస్‌ని వణికిస్తున్న కౌశల్ ఆర్మీ  ప్రస్తుతం కాలేజీల్లో, బస్టాండుల్లో, సినిమా థియేటర్లలో ఇలా..నలుగురు కలుసుకుంటే వినిపించే మాటలు బిగ్‌బాస్ 2 చూసావా? ఎవరు విన్నర్? అనే విషయం గురించే చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు బిగ్‌బాస్‌లో పోటీ చేస్తున్నవారి గురించి అంతగా ఎవరికీ తెలియదు. కొందరు మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలిమినెట్ అవుతారో అని ప్రేక్షకుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. అంతే కాకుండా బిగ్‌బాస్‌లోని ప్రతి ఒక్క సభ్యునికి అభిమానుల సంఖ్య రోజురోజుకీ […]

బిగ్‌బాస్‌ని వణికిస్తున్న కౌశల్ ఆర్మీ 

ప్రస్తుతం కాలేజీల్లో, బస్టాండుల్లో, సినిమా థియేటర్లలో ఇలా..నలుగురు కలుసుకుంటే వినిపించే మాటలు బిగ్‌బాస్ 2 చూసావా? ఎవరు విన్నర్? అనే విషయం గురించే చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు బిగ్‌బాస్‌లో పోటీ చేస్తున్నవారి గురించి అంతగా ఎవరికీ తెలియదు. కొందరు మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలిమినెట్ అవుతారో అని ప్రేక్షకుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. అంతే కాకుండా బిగ్‌బాస్‌లోని ప్రతి ఒక్క సభ్యునికి అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొన్నటి వరకు పవన్‌కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, అల్లుఅర్జున్, వెంకటేశ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్‌టిఆర్‌ల ఫ్యాన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కానీ ఇప్పుడు మాత్రం తెలుగురాష్ట్రల్లో ఒక్కరి పేరు బలంగా వినిపిస్తుంది అదే కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ సీజన్ 2 లో ఎవరు విజేత అనే విషయం మొత్తం డిసైడ్ ఫాక్టర్ అంతా ఇప్పుడు కౌశల్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఇప్పడు ఇదే విషయంపై బిగ్‌బాస్ టీమ్, యాజమాన్యం కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ సీరియల్ యాక్టర్ గా, సినిమాల్లో కూడా నటించే కౌశల్ అనే వ్యక్తి బిగ్‌బాస్‌ని శాసిస్తున్నాడు. తనపై వేల సంఖ్యలో సోషల్‌మీడియాలో గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఒక అభిమాని బిగ్‌బాస్ కోరిక మేరకు కౌశల్‌కి ఒక లెటర్‌లో ఈ విషయం గురించి రాశాడు. ఈ విషయంపై కౌశల్ వివరణ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ విన్నర్ ఎవరూ అనే విషయం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠగా మారింది.

బిగ్‌బాస్ 2లో ఎంట్రీ ఇచ్చింది మొదలు పక్కాగా గేమ్ ఆడుతూ, హౌస్‌లో అందరూ కార్నర్ చేసినా సరే, దాన్ని సానుకూలంగా మలచుకున్నాడు కౌశల్. అతని అభిమానులు సోషల్ మీడియాలో ఏర్పాటుచేసిన కౌశల్ ఆర్మీ కారణంగా లక్షలాది అభిమానులను కౌశల్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దేశం హద్దులు దాటి విదేశాల్లో సైతం కౌశల్ కి అభిమానులు ఏర్పడ్డారు. అందుకు కోట్లలో ఓట్లు నమోదవుతున్నాయి. స్టార్ హీరోలకు కూడా లేని ఫాలోయింగ్ ప్రస్తుతం కౌశల్ సొంతం అయింది. ఇక బిగ్‌బాస్ షోలో కీలకమైన గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండటంతో మరి కొద్దిరోజుల్లో ఈ షో ముగియబోతోంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని ఏమి మాట్లాడినా, కౌశల్ పై కామెంట్స్ చేసినా బిగ్‌బాస్ షో మీద దాని ప్రభావం పడుతోంది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లో కౌశల్ అభిమానులు నిర్వహించిన 2కె రన్ అనుకున్న దానికంటే ఎక్కువే విజయవంతం అయింది. కౌశల్ ఫ్యాన్స్ రోడ్డెక్కి ప్రదర్శన చేయడంతో ఇది చూసిన జనం కూడా వాళ్ళతో అడుగులు వేశారు.అనూహ్యంగా సాగిన ఈ రన్ చూసిన బిగ్‌బాస్ యాజమాన్యం ఖంగుతిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కౌశల్ విజేత అవుతాడని ప్రస్తుతం వస్తున్న ఓటింగ్ చెప్పకనే చెబుతోంది. రోజురోజుకీ కౌశల్‌కి ఓటింగ్‌లో కూడా అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దాంతో ప్రతి వారం కౌశల్ సేఫ్‌జోన్‌లోకి వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కౌశల్‌కి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానం ఎలా ఉంటుందో వేరేచెప్పక్కర్లేదు.

ఇదే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. గేమ్ విషయంలో కౌశల్‌ని విన్నర్‌గా ప్రకటించి తీరాలని, లేకుంటే కౌశల్ ఫాన్స్ నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని షో నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారట. ఎక్కువ ఓట్లు వచ్చినవాళ్లే విజేత అవుతారన్న బిగ్‌బాస్ రూల్స్ ఇప్పుడు కౌశల్ ని విజేతగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసింది. బిగ్‌బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయ్యాక హౌజ్ లోకి రావడం కుదరదు. కానీ శ్యామలా, నూతన్ నాయుడులను రీ ఎంట్రీ ఇప్పించారు. మరో పక్క హౌజ్‌లో అందరిది ఒక దారి అయితే కౌశల్ ఒక్కడిదే మరోదారి అయ్యింది. గత రెండు వారాల నుంచి గీతా మాధురి కౌశల్ మధ్య వార్ నడుస్తుంది దీంతో కౌశల్ ఫ్యాన్స్ గీతపై కొద్దిగా కోపంగా ఉన్నట్లుకూడా తెలుస్తోంది. సీజన్ మొత్తం కౌశల్ ను గీత నామినేట్ చేయగా కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో ప్రతి వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటున్నాడు కౌశల్. ఇక ఈ ర్యాలీ ప్రభావం చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కాకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆలోచిస్తున్నారు ప్రతిఒక్కరు.

బిగ్ బాస్ కేవలం ఆడియెన్స్ ఓట్లతోనే నడిచే రియాలిటీ షో. కౌశల్ ఆర్మీ వల్ల ఇప్పటివరకు కౌశల్ కే ఎక్కువ ఓట్లు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో కౌశల్ ఆర్మీ చేసిన 2కే వాక్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అవాక్కయ్యేలా 2కే వాక్ జరిగింది. కచ్చితంగా కౌశల్ కే టైటిల్ ఇవ్వాల్సిందే లేదంటే పరిస్థితులు ఊహిచలేం అన్నట్టుగా ఉన్నాయి. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. గత సంవత్సరం జరిగిన బిగ్‌బాస్ 1లో కూడా సభ్యులకు అభిమానులు ఉన్నా… ఈ సంవత్సరం ఉన్నంత అభిమానుల సంఖ్యలేకపోవడం విశేషం. దానికితోడు ప్రతి వారం ఒక సెలబ్రెటీతో షోలో పాల్గొనటం ద్వారా రేటింగ్ ఎక్కువైపోయింది. తమ అభిమాన హీరో హీరోయిన్స్ రావడంతో ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. మొదట్లో అంత ఆదరణ లేకపోయినా 50 రోజులు గడిచిన తరువాత బిగ్‌బాస్ షోకి అభిమానుల సంఖ్యపెరిగిపోయింది. గత సంవత్సరం బిగ్‌బాస్ విజేతగా శివబాలాజీ విజయం సాధించగా ఈ సంవత్సరం ఎవరు విజేత అవుతారో అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.                                                                    – కాసోజు విష్ణు

Comments

comments