పాఠశాల బస్సులపై రాళ్ల దాడి…

పుణె: దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసందే. ఈనేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో ఆందోళనకారులు పాఠశాల బస్సులపై రాళ్లతో దాడి చేయడం కలకలం రేపింది. పలు పాఠశాలల బస్సులు ధ్వంసం అయి కనిపించాయి. ఈ ఘటనపై పుణె నియోజక వర్గ ఎంపి, భాజపా నేత అనీల్ షిరోలె ఆగ్రహాం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష […]

పుణె: దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసందే. ఈనేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో ఆందోళనకారులు పాఠశాల బస్సులపై రాళ్లతో దాడి చేయడం కలకలం రేపింది. పలు పాఠశాలల బస్సులు ధ్వంసం అయి కనిపించాయి. ఈ ఘటనపై పుణె నియోజక వర్గ ఎంపి, భాజపా నేత అనీల్ షిరోలె ఆగ్రహాం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్ష పార్టీలకు నిరసనలు తెలుపుకునే హక్కు ఉందని, యువతను పక్కదారి పట్టించేలా రెచ్చగొడుతూ పాఠశాలలో చదువుకునే అమాయక చిన్నారులపై కూడా దాడులు చేసేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ, పౌరుల్లో భయాన్ని నింపుతున్నాయని, స్వార్థపర రాజకీయాలు చేయడం విచారకరం’ అని ట్వీట్ చేస్తూ ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన తమ నియోజక వర్గంలోని పాఠశాల బస్సుల ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.

Comments

comments

Related Stories: