స్నేహమేరా జీవితం…!

బెన్ అనే కుక్క రోజుకు నాలుగ్గంటలు తన యజమాని యైన పాట్ డూహన్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతుండేది. ఎందుకంటే తన ఫ్రెండ్‌ను కలవడానికి. ఇంతకీ ఎవరా ఫ్రెండ్ ఏమా కథ అంటే…టోరీ ద్వీపంలోని ఓ సముద్రంలో ఉన్నాడు దాని స్నేహితుడు. బెన్ ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి కలిసేది ఎవరినో తెలుసా..? డగ్గీ అనే డాల్ఫిన్‌ను. సో ఇద్దరూ ఫ్రెండ్స్‌అన్నమాట. ఇంతకీ వీళ్లకు స్నేహం ఎలా కుదిరింది అనే డౌట్ రాకమానదు. అది వాటర్‌లో దిగ్గానే చక్కగా స్విమ్మింగ్ […]


బెన్ అనే కుక్క రోజుకు నాలుగ్గంటలు తన యజమాని యైన పాట్ డూహన్‌ను వదిలిపెట్టి వెళ్లిపోతుండేది. ఎందుకంటే తన ఫ్రెండ్‌ను కలవడానికి. ఇంతకీ ఎవరా ఫ్రెండ్ ఏమా కథ అంటే…టోరీ ద్వీపంలోని ఓ సముద్రంలో ఉన్నాడు దాని స్నేహితుడు. బెన్ ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి కలిసేది ఎవరినో తెలుసా..? డగ్గీ అనే డాల్ఫిన్‌ను. సో ఇద్దరూ ఫ్రెండ్స్‌అన్నమాట. ఇంతకీ వీళ్లకు స్నేహం ఎలా కుదిరింది అనే డౌట్ రాకమానదు. అది వాటర్‌లో దిగ్గానే చక్కగా స్విమ్మింగ్ చేస్తూ డగ్గీని కలుస్తుంది. ఒక్కోసారి ఇద్దరూ కల్సి సరదాగా స్విమ్మింగ్ పోటీలు కూడా పెట్టుకుంటారు. ఒక్కోసారి పాపం కుక్కగారే ఓడిపోతుంటారు. దాన్ని గెలిపించడానికి డగ్గీ ఓడిపోతుంది. అచ్చూ సినిమా లాగానే.

ఒక్కోసారి పాపం డగ్గీ దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంటుంది. కుక్క యజమాని ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. అందరూ చాలా ఆనందంగా చూడటం మొదలుపెట్టారు. వీరి స్నేహానికి అబ్బురపడుతున్నారు. మానవుడి బెస్ట్ ఫ్రెండ్ అయిన కుక్క తన ప్రేమను డాల్ఫిన్‌కు కూడా పంచుతుందన్నమాట. అక్కడ స్థానికులేమంటారంటే…డగ్గీ కొన్నేళ్లక్రితం తన పాట్నర్‌ను కోల్పోయింది. ఎప్పుడైతే కుక్కను చూసిందో దానిలో స్నేహం చిగురించింది. అనుకోని బంధం ఏర్పరుచుకుంది. ఒంటరితనాన్ని పోగొట్టుకుంది. స్నేహానికి హద్దుల్లేవని నిరూపించారు వీరిద్దరూ …

Comments

comments

Related Stories: