గిన్నిస్ రికార్డ్స్: ఈ బామ్మకు 118 ఏళ్లు

వరల్డ్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకోవాలని చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు.  గిన్సిస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అందరికంటే భిన్నంగా ఏదైనా చేసి చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది. ఈ ఏడాది గిన్నిస్‌లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నవారిని ఓసారి చూద్దాం…. బొలీవియా దేశానికి చెందిన జూలియా ఫ్లోరిస్ కొలక్యూ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఇంతకీ ఆమె ఏంచేసిందనేగా. ఏం చేయలేదు. 118 సంవత్సరాల వయసులోనూ చక్కగా ఆరోగ్యంగా ఉంది. గిటార్ వాయిస్తూ జానపద గీతాలు పాడుతుంది. సుదీర్ఘకాలం […]

వరల్డ్ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకోవాలని చాలామంది అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు.  గిన్సిస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అందరికంటే భిన్నంగా ఏదైనా చేసి చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది. ఈ ఏడాది గిన్నిస్‌లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నవారిని ఓసారి చూద్దాం….

బొలీవియా దేశానికి చెందిన జూలియా ఫ్లోరిస్ కొలక్యూ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఇంతకీ ఆమె ఏంచేసిందనేగా. ఏం చేయలేదు. 118 సంవత్సరాల వయసులోనూ చక్కగా ఆరోగ్యంగా ఉంది. గిటార్ వాయిస్తూ జానపద గీతాలు పాడుతుంది. సుదీర్ఘకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డు కెక్కింది. ఈ బామ్మ రెండు ప్రపంచ యుద్ధాలను, స్థానిక విప్లవాలకు సాక్షిగా నిలిచింది. స్కాబా పట్టణంలో ఒకప్పుడు మూడువేల జనాభా ఉండేది. ఇప్పుడా పట్టణంలో జనాభా లక్షా 75 వేలకు చేరుకున్నది. జూలియా పెళ్లి చేసుకోలేదు. పెంపుడు జంతువులే ఆమె నేస్తాలు. ప్రపంచంలోనే చాలా పెద్ద వయసు ఉన్న మహిళగా జూలియా ఫ్లోర్స్ రికార్డ్‌లోకి ఎక్కింది.

ఆమెకిప్పుడు 118 సంవత్సరాలు. దక్షిణ అమెరికాలోనే జీవితకాలం రేటు ఎక్కువగా వున్నట్లు చెప్పడానికి ఈమె సాక్ష్యం. అక్టోబర్ 26, 1900లో బొలేవియన్ కొండ ప్రాంతంలో పుట్టింది. బతకడానికి పండ్లు, కూరగాయలు అమ్ముకునేదట. అదే ఆమె ఆరోగ్య రహస్యమని చెబుతోంది. డైట్ పాటిస్తుందట. అప్పుడప్పుడూ కేక్, ఒక గ్లాసు సోడా తాగుతుందట. కొన్నేళ్ల క్రితం కింద పడిపోగా వెన్నునొప్పి వచ్చినట్లు చెబుతోంది. ఆమెను చూసిన డాక్టర్ ఇక జూలియా తిరిగి నడవలేదన్నాడట. కానీ ఆ వైద్యుడు చెప్పింది తప్పని నిరూపించింది జూలియా, హాయిగా నడుస్తూ, తన పని తాను చేసుకుంటూ…. 117 ఏళ్ల జపాన్‌కు చెందిన మహిళ నబి తాజిమా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు ఉన్న మహిళగా గిన్నిస్‌లోకి ఎక్కింది. కాగా, ఆమె ఈ ఏడాదే చనిపోయింది. ఆమెను అధిగమించింది  జూలియా బామ్మ.

Comments

comments