రష్మిక మందన నిశ్చితార్థం క్యాన్సిల్..?

ఇటీవల వచ్చిన ‘గీత గోవిందం’తో సూపర్ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందనపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కన్నడ నటుడు, దర్శకనిర్మాత రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఒక్కటి కావాలని గత ఏడాది జులై 3న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్నవార్తల ప్రకారం రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందని. గతంలో కూడా ఇలాగే పుకార్లు రావడంతో ఆమె స్వయంగా […]

ఇటీవల వచ్చిన ‘గీత గోవిందం’తో సూపర్ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందనపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కన్నడ నటుడు, దర్శకనిర్మాత రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. ‘కిరిక్ పార్టీ’లో జంటగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఒక్కటి కావాలని గత ఏడాది జులై 3న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్నవార్తల ప్రకారం రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందని. గతంలో కూడా ఇలాగే పుకార్లు రావడంతో ఆమె స్వయంగా వాటిని ఖండించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్త వైరల్ అవుతోంది. 22 ఏళ్ల రష్మిక ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. రష్మిక సన్నిహితుల సమాచారం మేరకే ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. కెరీర్ కోసం తన తల్లిదండ్రులతో చర్చించి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని ఆ వార్త సారాంశం. కాగా,  ఇప్పటి వరకు దీనిపై రష్మిక స్పందించలేదు.

ఇక ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ‘గీత గోవిందం’తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తనదైన చలాకీ నటన, అభినయంతో యువతను ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఆమె వైపే చూస్తున్నారు. తెలుగు, కన్నడ రెండు పరిశ్రమల్లోనూ రష్మికకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, మల్టీస్టారర్ ‘దేవదాస్’లో నానితో నటిస్తోంది. కన్నడలో కూడా పలు భారీ ప్రాజెక్టులు ఒప్పకుందని సమాచారం. ఇలా రష్మిక కెరీర్ పీక్ స్టేజీలో ఉండడంతో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఎమైనప్పటికీ రష్మిక నిశ్చితార్థం రద్దు చేసుకుందనే వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం ఆమె స్వయంగా చెబితే గానీ తెలియదు. అది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Comments

comments

Related Stories: