జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ జరిమానా

న్యూఢిల్లీ: దేశీయ టెలికామ్ ఆపరేటర్లపై టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ జరిమానా విధించింది. వీటిలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ వంటివి ఉన్నా యి. మార్చి త్రైమాసికంలో పలు సేవల నాణ్యతలో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను ట్రాయ్ వీటిపై జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో సర్వీస్ ప్రొవైడర్లు విఫలమైనందుకు గాను ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ట్రాయ్ విధించిన జరిమానాను కట్టే పనిలో సర్వీస్ […]

న్యూఢిల్లీ: దేశీయ టెలికామ్ ఆపరేటర్లపై టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ జరిమానా విధించింది. వీటిలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ వంటివి ఉన్నా యి. మార్చి త్రైమాసికంలో పలు సేవల నాణ్యతలో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను ట్రాయ్ వీటిపై జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో సర్వీస్ ప్రొవైడర్లు విఫలమైనందుకు గాను ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ట్రాయ్ విధించిన జరిమానాను కట్టే పనిలో సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌పై రూ. 11 లక్షలు, ఐడియాపై రూ. 12.5 లక్షలు, వొడాఫోన్‌పై రూ. 4 లక్షల జరిమానా విధించగా… రిలయన్స్ జియోకు అత్యధికంగా రూ.34 లక్షల జరిమానా విధించింది. 2017 అక్టోబర్ 1 నుంచి ట్రాయ్ కొత్తగా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ మేరకు 2018 జనవరి నుంచి మార్చి తొలి త్రైమాసికం వరకు వాటిని పరిశీలించిన ట్రాయ్ ఈ మేరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆపరేటర్లపై జరిమానా విధించాలనే ఆలోచనతో ఉన్నామని, ఆ ప్రక్రియ చివరి దశలో ఉందని గతంలో ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్. రామశర్మ పేర్కొన్నారు. ట్రాయ్ నిబంధనల మేరకు కాల్స్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, కస్టమర్ కేర్, కాల్ సెంటర్స్ నుంచి వినియోగదారులకు సరైన స్పందన లేకపోవడం(వాయిస్ కాల్స్) తదితర కారణాల దృష్ట్యా ట్రాయ్ రిలయన్స్ జియోపై జరిమానా విధించింది. టెలికామ్ సంస్థల్లో బిల్లింగ్ సమస్యలు (పోస్ట్‌పెయిడ్), వినియోగదారులు కస్టమర్ కేర్, కాల్ సెంటర్స్‌ను సంప్రదించే ప్రక్రియలో లోపాలను ట్రాయ్ గుర్తించింది. అలాగే నిర్దిష్ట కాలపరిమితితో ఆపరేటర్లు తీసుకున్న వాయిస్‌కాల్స్ శాతం, కాల్ డ్రాప్స్, వినియోగదారుల సమస్యలకు వారం రోజుల్లో పరిష్కారం లభించకపోవడం వంటి కారణాలను గుర్తించిన ట్రాయ్ ఈ సంస్థలపై జరిమానా విధించింది. దీనిపై ఏ టెలికామ్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.

Comments

comments

Related Stories: