టూరిస్టులపై దాడి

పారిస్ : పారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దుండగుడి దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతంలో ఓ దుండగుడు కత్తితో, ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. […]

పారిస్ : పారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దుండగుడి దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతంలో ఓ దుండగుడు కత్తితో, ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే అతడు పారిపోయాడు. ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు తెలిపారు. కేవలం అపరిచితులను టార్గెట్ చేసుకొని అతడు దాడి చేశాడని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తి అఫ్ఘాన్ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పారిస్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Attack on Tourists in Paris

Comments

comments

Related Stories: