రాఫెల్ కమిషన్లే రూ. 21 వేల కోట్లట…

అహ్మదాబాద్ : రాఫెల్ డీల్ అనూహ్య స్థాయిలో జరిగిన స్కామ్ అని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ వారికి ఈ ఒప్పందంలో భాగంగా రూ 21000 కోట్ల ముడుపులతో కూడిన ఆఫ్‌సెట్ డీల్ దక్కిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత రాఫెల్ ఒప్పందం వెనుక భారీ కుంభకోణం ఉం దని, 1980 ప్రాంతంలో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ స్కామ్ స్థాయి ముడుపులు చేతులు మారాయని ఆయన సరిపోల్చారు. తమ […]

అహ్మదాబాద్ : రాఫెల్ డీల్ అనూహ్య స్థాయిలో జరిగిన స్కామ్ అని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ వారికి ఈ ఒప్పందంలో భాగంగా రూ 21000 కోట్ల ముడుపులతో కూడిన ఆఫ్‌సెట్ డీల్ దక్కిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత రాఫెల్ ఒప్పందం వెనుక భారీ కుంభకోణం ఉం దని, 1980 ప్రాంతంలో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ స్కామ్ స్థాయి ముడుపులు చేతులు మారాయని ఆయన సరిపోల్చారు. తమ కంపెనీకి భారీ లాభం దక్కిందనే విమర్శలను అనిల్ అంబానీ ఇప్పటికే ఖండించారు. కేంద్రంలోని బిజెపి అధినాయకత్వపు ప్రభుత్వం జాతీయ భద్రతపై రాజీ పడిందని, భారతీయ వాయుదళాన్ని చివరికి గాలికి వదిలేసిందని విమ ర్శించారు.

రాఫెల్ నాణ్యతా ఇతర ప్రమాణాలను పట్టించుకోకుండా కేవ లం ఈ డీల్‌ను అనిల్ అంబానీకి కట్టబెట్టేందుకే రూపొందించినట్లుగా ఉందని అన్నారు. రాఫెల్ డీల్‌లో కళ్లు చెదిరే స్థాయిలో ముడుపులు మారాయి. బోఫోర్స్ స్కామ్ విలువ అప్పట్లో రూ 64కోట్లు. అప్పటికి అదే ఎక్కువ. అయితే ఇప్పటి రాఫెల్ స్కామ్‌లో కమిషన్లే 30శాతం వరకూ ఉన్నాయి. అనిల్ అంబానీ కంపెనీకి కేవలం కమిషన్‌గా దక్కిందే రూ 21వేల కోట్లు అంటే ఇక స్కామ్ విలువ ఏ పాటిదో తెలుసుకోవచ్చు.

Comments

comments

Related Stories: