ప్రేమికుల అడ్డా…లవ్ కెనాల్

కొత్తగా వివాహం జరిగిన జంటలు ఫొటొషూట్‌కి ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ రైలు మార్గం. చుట్టూ చెట్లతో ఆకుపచ్చ అందాలను సింగారించుకున్నట్టున్న ఈ ఉదానవనం చూడడానికి ఎంత బాగుందో కదా! నిజానికి ఇది ఒక రైలు మార్గం. ఈ ప్రాంతం ఉక్రెయిన్ దేశంలో క్లివన్ నగరం నుంచి ఆర్జివ్ నగరాన్ని కలుపుతూ 5 కిలోమీటర్ల పొడవునా అడవిలో ఈ రైల్వేట్రాక్‌ను నిర్మించారు. రోజు రోజుకి చెట్లు పెరుగుతూ దట్టంగా అల్లుకోవడంతో […]

కొత్తగా వివాహం జరిగిన జంటలు ఫొటొషూట్‌కి ఎక్కువగా ఇష్టపడే ప్రాంతాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ రైలు మార్గం. చుట్టూ చెట్లతో ఆకుపచ్చ అందాలను సింగారించుకున్నట్టున్న ఈ ఉదానవనం చూడడానికి ఎంత బాగుందో కదా! నిజానికి ఇది ఒక రైలు మార్గం. ఈ ప్రాంతం ఉక్రెయిన్ దేశంలో క్లివన్ నగరం నుంచి ఆర్జివ్ నగరాన్ని కలుపుతూ 5 కిలోమీటర్ల పొడవునా అడవిలో ఈ రైల్వేట్రాక్‌ను నిర్మించారు. రోజు రోజుకి చెట్లు పెరుగుతూ దట్టంగా అల్లుకోవడంతో ఇదో సొరంగంలా తయారైంది. ఎండాకాలంలో ఎండిన ఆకులతో బూడిద రంగులో, శీతాకాలంలో పూర్తిగా మంచు కప్పుకొని తెలుపు రంగులో, వర్షాకాలంలో ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ ఆకుపచ్చ ప్రకృతి తోరణం అక్కడి దేశంలోని ప్రకృతి ప్రేమికులతో పాటు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఒక ఇష్టమైన విహార ప్రాంతంగా మారింది. ఇక్కడ చాలా వరకు ప్రేమికుల తాకిడి ఎక్కువ అవ్వడంతో దీనికి లవ్ కెనాల్ అనిపేరు కూడా పట్టారు.