గుండెనొప్పి సీఎమ్‌వైసీతో నిర్ధారణ

సిఎమ్‌వైసి పరీక్ష ద్వారా మొదటి మూడు గంటల్లో ఎవరికి గుండెపోటు వస్తుందో, ఎవరికి రాదో అనేది తెలిసిపోతుందంటున్నారు వైద్యులు. స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఛాతి నొప్పితో బాధపడుతున్న సుమారు రెండు వేల మంది రోగులపై ట్రోపోనిన్, సీఎమ్‌వైసీ రక్త పరీక్షలు నిర్వహించారు. “ఈ కొత్త విధానం ద్వారా పేషెంట్లు ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఎదురు చూసే బాధ తప్పుతుంది” అని లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ టామ్ కైయర్ అన్నారు. ఈ పరీక్షలతో […]

సిఎమ్‌వైసి పరీక్ష ద్వారా మొదటి మూడు గంటల్లో ఎవరికి గుండెపోటు వస్తుందో, ఎవరికి రాదో అనేది తెలిసిపోతుందంటున్నారు వైద్యులు. స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఛాతి నొప్పితో బాధపడుతున్న సుమారు రెండు వేల మంది రోగులపై ట్రోపోనిన్, సీఎమ్‌వైసీ రక్త పరీక్షలు నిర్వహించారు. “ఈ కొత్త విధానం ద్వారా పేషెంట్లు ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఎదురు చూసే బాధ తప్పుతుంది” అని లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ టామ్ కైయర్ అన్నారు. ఈ పరీక్షలతో 15-30 నిమిషాల్లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.ఈ పరీక్ష విజయవంతం అయితే హాస్పిటల్‌లో ఖర్చులు కూడా తగ్గుతాయంటున్నారు. కొత్త పరీక్షను ప్రవేశపెట్టే ముందు మరికొంత పరిశోధనలు జరగాలని ప్రొ.సైమన్ రే తెలుపుతున్నారు. గుండె పోటు సూచనలు కనిపించగానే ఈ పరీక్షను చేయవచ్చు. వచ్చింది గుండెపోటా? లేక ఛాతి నొప్పా అనేది సిఎమ్‌వైసి పరీక్ష ద్వారా నిర్థారితమౌతుందని రే చెప్పారు.