తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం

పూణేలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుండి మోడలింగ్ చేయడమంటే  ఇష్టం. దాంతో పాటు కథక్ నాట్యం కూడా నేర్చుకుంది. నాట్యం నేర్చుకుంటున్నప్పుడే నటనమీద ఆసక్తి పెరిగింది. ముంబయి పూణే లో తెలుగు సినిమాలు ప్రదర్శిస్తారు. తెలుగు రాకపోయినా  సినిమాలు చూసేదంట. ఇంతకు ముందు చాలా యాడ్స్‌లో నటించింది. అదే ఆసక్తితో  సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి తెలుగులో  “నర్తనశాల” తో తెరంగేట్రం చేసింది.  నాగశౌర్యతో జతగా నటించడం సంతోషంగా ఉందంటూ… తెలుగు సినిమాలో చాలా రకాల ఎమోషన్స్, […]

పూణేలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుండి మోడలింగ్ చేయడమంటే  ఇష్టం. దాంతో పాటు కథక్ నాట్యం కూడా నేర్చుకుంది. నాట్యం నేర్చుకుంటున్నప్పుడే నటనమీద ఆసక్తి పెరిగింది. ముంబయి పూణే లో తెలుగు సినిమాలు ప్రదర్శిస్తారు. తెలుగు రాకపోయినా  సినిమాలు చూసేదంట. ఇంతకు ముందు చాలా యాడ్స్‌లో నటించింది. అదే ఆసక్తితో  సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి తెలుగులో  “నర్తనశాల” తో తెరంగేట్రం చేసింది.  నాగశౌర్యతో జతగా నటించడం సంతోషంగా ఉందంటూ… తెలుగు సినిమాలో చాలా రకాల ఎమోషన్స్, రొమాన్స్, లవ్, కామెడీ ఇలా అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. చాలా ఎంటర్ టైన్‌మెంట్ ఉంటుంది. తెలుగు సినిమాలంటే నాకెంతో ఇష్టం అంటూ ఈ సినిమా చేస్తూనే చాలా నేర్చుకున్నాను అంటోంది. తరువాత సిద్ధార్థ్, జీవి ప్రకాశ్  కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటించనుంది ఈ పూణే అందాల తార.

పేరు: కాశ్మీర పరదేశి

నిక్ నేమ్: డిజైన్ స్ట్రాటజిస్ట్

వయసు : 23 ఏళ్ళు

జాతీయత : భారతీయురాలు

మాతృభాష: హిందీ

పుట్టింది: 1995లో మహారాష్ట్రలోని పూణే (ముంబై) లో జన్మించింది.

చదువు: పూణేలోని అన్నే ఉన్నత పాఠశాలలో చదువుకుంది.ముంబైలో ఫ్యాషన్ కమ్యూనికేషన్.

నివాసం: ముంబై, మహారాష్ట్ర, ఇండియా

కళలు: చిన్నప్పటి నుండి కథక్ నాట్యం నేర్చుకుంది. మోడలింగ్ అంటే ఇష్టం.

తెలుగులో మొదటి సినిమా: నర్తనశాల

అభిమాని : చిరంజీవి, అల్లుఅర్జున్, మహేష్‌బాబు

Comments

comments