గోరింట ‘చిత్రాలు’

ఆడవాళ్ల అరచేతిలో గోరింట పండనిదే ఏ పండుగా అవదు. పెళ్లిళ్ల సమయంలో మెహందీ పేరిట గోరింటాకు పెట్టడాన్ని ఓ పండుగలా చేస్తున్నారు. అలాంటప్పుడు మెహందీ డిజైన్‌లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. చూసిన వాళ్లంతా స్పెషల్‌గా చెప్పుకునేలా కనిపించాలి. మనకిష్టమైన వాళ్లు పొగిడేలా ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉన్న మెహందీ ‘పోర్ట్రెయిట్ మెహందీ’. ఇప్పుడిది సరికొత్త ట్రెండ్ అయింది. ఈ పోర్ట్రెయిట్ మెహందీతో మనకిష్టమైనవారిని అరచేతిలో స్వయంగా కొలువుదీర్చినట్టు ఒకింత గర్వంగా చూపించు కోవచ్చు. గోరింటాకులో భాగంగా […]

ఆడవాళ్ల అరచేతిలో గోరింట పండనిదే ఏ పండుగా అవదు. పెళ్లిళ్ల సమయంలో మెహందీ పేరిట గోరింటాకు పెట్టడాన్ని ఓ పండుగలా చేస్తున్నారు. అలాంటప్పుడు మెహందీ డిజైన్‌లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. చూసిన వాళ్లంతా స్పెషల్‌గా చెప్పుకునేలా కనిపించాలి. మనకిష్టమైన వాళ్లు పొగిడేలా ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉన్న మెహందీ ‘పోర్ట్రెయిట్ మెహందీ’. ఇప్పుడిది సరికొత్త ట్రెండ్ అయింది.

ఈ పోర్ట్రెయిట్ మెహందీతో మనకిష్టమైనవారిని అరచేతిలో స్వయంగా కొలువుదీర్చినట్టు ఒకింత గర్వంగా చూపించు కోవచ్చు. గోరింటాకులో భాగంగా నచ్చిన వారి బొమ్మను చేతిలోనే చేర్చుకోవచ్చు. చుట్టూతా ఎన్నిరకాల డిజైన్స్ వేసుకున్నా మధ్యలో బొమ్మ రూపుదిద్దుకుంటుంది ఈ గోరింటాకుతో.

ఈ రకం మెహందీలు పెట్టటానికి కొన్ని సంస్థలు ఉంటాయి. ఒక నెలరోజులు ముందుగానే వారికి తెలపాలి. దీనికి సంబంధించిన నిపుణులైన కళాకారులూ ఉంటారు. ఇంటర్నెట్‌లో పోర్ట్రెయిట్ మెహందీ అని వెతికితే మరికొన్ని సంస్థల పేర్లూ, మెహందీ చిత్రాలూ కనిపిస్తాయి. మొదటగా మనం వేయించుకునే వారి ఫోటోలు ఆ సంస్థ వారికి అప్పగించాలి. వాళ్లు స్కెచ్‌లు గీస్తారు. ఆ తర్వాత అదే రీతిలో స్టెన్సిల్ తరహాలో స్టిక్కర్లను రూపొందిస్తారు. మెహందీ పెట్టేటప్పుడు ఆ స్టిక్కర్‌ను అరచేతిలో ఉంచి దానిమీద గోరింటాకు పూస్తారు. ఎండిపోయిన తరువాత స్టిక్కర్‌ను తీసేస్తారు. అప్పుడు స్టిక్కర్ అంటించిన భాగం మినహా మిగిలిన భాగం అంతా పండుతుంది. కావలసిన బొమ్మ అరచేతిలో పండుతుంది. తర్వాత మనకి కావలసిన డిజైన్‌ను ఆ బొమ్మ చుట్టూ వేసుకోవచ్చు. నేరుగా ఫొటోను చూస్తూ చేతిమీద వేసేవారూ ఉంటారు. మొత్తానికి వేడుకల్లో, సంబరాల్లో ఈ పోర్ట్రెయిట్ మెహందీ ఉంటే కొత్తరకం ప్రత్యేకత ఉంటుంది.