వృద్ధురాలిపై లైంగిక దాడి…

కరీంనగర్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కమాంధుడు వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన మానకొండూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిజాయితీగూడెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాయితీగూడెం గ్రామంలో (వృద్ధురాలు) డి.కాంతమ్మ(62) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కామాంధుడు కోమాకుల సంపత్(45) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో కామాంధుడు పారిపోయాడు. శుక్రవారం […]


కరీంనగర్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కమాంధుడు వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన మానకొండూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిజాయితీగూడెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాయితీగూడెం గ్రామంలో (వృద్ధురాలు) డి.కాంతమ్మ(62) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కామాంధుడు కోమాకుల సంపత్(45) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో కామాంధుడు పారిపోయాడు. శుక్రవారం రాత్రి జరిగిన విషయాన్ని వృద్ధురాలు శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కామాంధున్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి దేహశుద్ధి చేసి తాళ్లతో విద్యుత్ స్థంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిజాయితీగూడెం గ్రామానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్‌పై కేసు నమోదు చేసికొని నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్టు మానకొండూర్ పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: