వరంగల్: ఇంటికి మగదిక్కు లేడని తీవ్ర మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తితో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండలోని బొక్కలగడ్డ సిటిజన్స్ క్లబ్ సమీపంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండలోని బొక్కలగడ్డకు చెందిన తల్లి సరిత, కుమార్తె మధుమిత లు చాలా రోజుల నుంచి మనోవేదనకు గురై, మగదిక్కు లేని జీవితం తమకు వద్దని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాగా కుమార్తె మధుమిత చదువుకుంటుండగా.. తల్లి రెవెన్యూ ఉద్యోగి అని తెలుస్తోంది. తల్లీకూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
comments