ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు : డిజిపి

ఖమ్మం : హైదరాబాద్ తరహాలో ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే సిసి కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెల్‌తో అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏడాది చివరినాటికి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖలో […]

ఖమ్మం : హైదరాబాద్ తరహాలో ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే సిసి కెమెరాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెల్‌తో అనుసంధానం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏడాది చివరినాటికి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించినప్పుడే నేరాలను అదుపులోకి తేవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

CC Cameras in Every Village : DGP

Comments

comments