సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఛటర్జీ కోల్‌కతాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 10న ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సిపిఎంలో […]

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఛటర్జీ కోల్‌కతాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 10న ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. సోమనాథ్ ఛటర్జీ 1971 నుంచి 2009 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మధ్యలో 1984లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సిపిఎంలో చేరిన ఛటర్జీ, 2008 వరకు అదే పార్టీలో కొసాగారు. యుపిఎ-1 ప్రభుత్వంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. యుపిఎ-1కి సిపిఎం మద్ధతు ఉపసహరించుకున్నప్పటికీ, ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. సోమనాథ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.

Comments

comments

Related Stories: