అక్కతమ్ముళ్ల ఘర్షణ : అక్క మృతి

వరంగల్: అక్కతమ్ముళ్ల ఘర్షణలో అక్క మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో శనివారం చోటుచేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం అక్క, తమ్ముడు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో తమ్ముడిని బెదిరించే క్రమంలో అక్క ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తక్షణమే ఆమెను దవాఖానకు తరలించే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే తీవ్రగాయాలపాలైన బాధితురాలు మృతిచెందింది. Comments comments

వరంగల్: అక్కతమ్ముళ్ల ఘర్షణలో అక్క మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో శనివారం చోటుచేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం అక్క, తమ్ముడు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో తమ్ముడిని బెదిరించే క్రమంలో అక్క ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తక్షణమే ఆమెను దవాఖానకు తరలించే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే తీవ్రగాయాలపాలైన బాధితురాలు మృతిచెందింది.

Comments

comments