కలెక్టర్ అమ్రపాలికి అవార్డు ప్రధానం

సుబేదారి: రెడ్‌క్రాస్ సంస్థలో విశిష్ట సేవలందించనందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డులు కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా పని చేసిన వాకాటి కరుణ, ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రామీణ జిల్లా కలెక్టర్ ఎం.హరిత, జనగాం కలెక్టర్ సిహెచ్.వినయ్‌కృష్ణారెడ్డి, వరంగల్ రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి అధ్యక్షతన సంస్థ పాలక వర్గం, వరంగల్ రెడ్ క్రాస్ సంస్థ 2014 నుంచి 2018 వరకు […]


సుబేదారి: రెడ్‌క్రాస్ సంస్థలో విశిష్ట సేవలందించనందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డులు కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా పని చేసిన వాకాటి కరుణ, ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రామీణ జిల్లా కలెక్టర్ ఎం.హరిత, జనగాం కలెక్టర్ సిహెచ్.వినయ్‌కృష్ణారెడ్డి, వరంగల్ రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్‌రెడ్డి అధ్యక్షతన సంస్థ పాలక వర్గం, వరంగల్ రెడ్ క్రాస్ సంస్థ 2014 నుంచి 2018 వరకు ఉత్తమ సేవలు అందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాను రెండవ స్థానంలో నిలిపినందుకు గాను కలెక్టర్లకు శుక్రవారం హైదరాబాద్‌లో అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆధునిక వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రెడ్‌క్రాస్ సంస్థకు మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Related Stories: