ప్రభుత్వ కళాశాలలో ఫర్నీచర్ కొరత

కొల్చారం: ప్రభుత్వాలు, పాలకులు మారి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ విద్యార్థుల దుస్థితి మారకపోవడంతో పాటు మౌలికసదుపాయలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. మండల కేంద్రమైన కొల్చారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో నాలుగు గ్రూపులు హెచ్‌ఇసి, సిఇసి, ఎంపిసి, బైపిసీ, రెండు గ్రూపులు ఆంగ్ల, తెలుగు బోధనలు జరుగున్నాయి. కళాశాల ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయులు, ఫర్నీచర్ లేకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో […]


కొల్చారం: ప్రభుత్వాలు, పాలకులు మారి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ విద్యార్థుల దుస్థితి మారకపోవడంతో పాటు మౌలికసదుపాయలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. మండల కేంద్రమైన కొల్చారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో నాలుగు గ్రూపులు హెచ్‌ఇసి, సిఇసి, ఎంపిసి, బైపిసీ, రెండు గ్రూపులు ఆంగ్ల, తెలుగు బోధనలు జరుగున్నాయి. కళాశాల ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయులు, ఫర్నీచర్ లేకపోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 1కోటి 20లక్షలతో జూనియర్ కళాశాల మంజూరై అనంతరం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. అపట్లో మౌలిక వసతులతో పాటు ఫర్నీచర్ కోరత తీవ్రంగా ఉందని మంత్రి, ఎంఎల్ఎ దృష్టికి తీసుకుపోగా సమస్య పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపడుతామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విఫలమయ్యారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలపైనే కూర్చోని చదువుకునే పరిస్థితి దాపురించింది. దీంతో పాటు కళాశాలలో పార్ట్‌టైం సిబ్బంది ఉన్నా అడ్మినిస్టేషన్ సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు పాలవుతున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. జూనియర్ కళాశాలకు స్వీపర్ కూడా లేకపోవడంతో లెక్చరర్లు, ప్రిన్సిపల్ సంయుక్తంగా తమ స్వంత డబ్బులతో ఒకరిని నియమించి కళాశాలను శుభ్రం చేస్తున్నారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ యతిరాజవల్లిని వివరణ అడుగగా… కళాశాలలో మౌలిక వసతులతో పాటు ఫర్నీచర్ కొరత తీవ్రంగా ఉందని ఈ విషయాన్ని స్థానిక ఎంఎల్ఎతో పాటు ఉన్నతాధికారులకు వివరించామని, త్వరలోనే సమస్య పరిష్కారం కావాలని ఆశించారు.

నేలపై కూర్చోని చదవడం ఇబ్బందిగా ఉంది…
మేము పదోవతరగతి వరకు చదువుకున్నప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు ఉండేవని, ఫర్నీచర్ ఉండి బల్లలపై కూర్చోని చదువుకునేవారమని, జూనియర్ కళాశాలకు వచ్చేసరికి నేలపై కూర్చోని చదువుకోవడం పట్ల ఇబ్బందిగా ఉందని కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినిలు శ్రీలత, ప్రత్యూషలు అన్నారు.

శివాని ఎంపిసి ద్వితీయ సంవత్సరం…
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధన సక్రమంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించకలేకపోతున్నారని, ఫర్నీచర్ కొరత తీవ్రంగా ఉందని, గతంలో స్థానిక ఎంఎల్ఎ మధన్‌రెడ్డి వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం విన్నవిస్తే నెలరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపినప్పటికీ ఇప్పటికి నెరవేరలేదని విద్యార్థిని శివాని తెలిపారు.

Comments

comments

Related Stories: