ఒకే కుటుంబంలో నలుగురిని కాటేసిన పాము…

మహబూబ్ నగర్: ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో నలుగురు అస్వస్థతకు గురైన సంఘటన భూత్పూర్ మండలం బట్టుపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వేముల సుదర్శన్‌రెడ్డి, సునీత భార్యా భర్తలు. వీరికి మంజిద్‌రెడ్డి (2), అశ్విత సంతానం. రాత్రి భోజనం అనంతరం ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఈ నలుగురిని కాటు వేయగా, సుదర్శన్‌రెడ్డి  […]

మహబూబ్ నగర్: ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో నలుగురు అస్వస్థతకు గురైన సంఘటన భూత్పూర్ మండలం బట్టుపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన వేముల సుదర్శన్‌రెడ్డి, సునీత భార్యా భర్తలు. వీరికి మంజిద్‌రెడ్డి (2), అశ్విత సంతానం. రాత్రి భోజనం అనంతరం ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఈ నలుగురిని కాటు వేయగా, సుదర్శన్‌రెడ్డి  తెల్లవారు జామున గుర్తించాడు. ఇంట్లో గాలించగా కట్లపాము కనిపించింది. సుదర్శన్ రెడ్డి పామును చంపిన కొద్ది సేపటికే బాలుడు మంజిద్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిపోయాడు.  వెంటనే బాలుడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయాడు. అనంతరం బాలుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా తల్లి సునీత, కూతురు మిన్ని అస్వస్థతకు గురైయ్యారు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఎస్‌విఎస్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కూతురు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువు లు తెలిపారు.

Comments

comments

Related Stories: