ఆకుపచ్చ జిల్లాయే లక్ష్యం

నాలుగవ విడత హరితహారంలో కోటి 31లక్షల మొక్కలు నాటడమే టార్గెట్ హరితహారంలో విద్యార్థులదే కీలకపాత్ర – జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మన తెలంగాణ/పాపన్నపేట: హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సం రక్షించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలో కొత్తపల్లి, అరికెల గ్రామ పంచాయతీ దూమ్లతాండ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మొక్కలు నాటారు. ముందుగా కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోను పరిశీలించి విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు […]

నాలుగవ విడత హరితహారంలో కోటి 31లక్షల మొక్కలు నాటడమే టార్గెట్
హరితహారంలో విద్యార్థులదే కీలకపాత్ర – జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మన తెలంగాణ/పాపన్నపేట: హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సం రక్షించాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలో కొత్తపల్లి, అరికెల గ్రామ పంచాయతీ దూమ్లతాండ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మొక్కలు నాటారు. ముందుగా కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోను పరిశీలించి విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని సూచిస్తూ విద్యార్థుల, ఉ పాధ్యాయులచే ప్రతిజ్ఞ చేయించారు. తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని విద్యార్థులకు మొక్కలను అందజేశారు. అనంతరం దూమ్లాతాండ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. అనతంరం ఫారెస్టు క్యాంపు ప్లాంటేషన్‌లో భాగంగా గత సంవత్సరం నాటిన మొక్కలను పరిశీంచారు. నాలుగవ విడత హరితహారంలో నాటేందుకు తీసిన గుంతలను కలెక్టర్ పర్యవేక్షించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అధికారులకు, ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… పర్యావరణ సంరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని తెలిపారు. అంతేకాకుండా నిషేదిత ప్లాస్టిక్‌ను ప్రతిఒక్కరు వినియోగించకూడదని, పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్‌ను తరిమికొట్టాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంలో తీర్చిదిద్దేంకు ప్రజలందరు ముందుకురావాలన్నారు. ఫారెస్టు ఏరియాలో కాంపు ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా జిల్లాలో 1కోటి 31లక్షల మొక్కలు నాటడమే లక్షంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. వర్షాలు వడ్డ వెంటనే పెద్ద ఎత్తున ఫారెస్టు క్యాంపు ప్లాంటేషన్‌లో మొక్కులు నాడడం జరుగుతందన్నారు. గ్రీన్ మెదక్ జిల్లాగా తయారు చేయడమే తమ లక్షమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో రాములు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపిపి పవిత్రదుర్గయ్య, ఎంపిడివో రాణి, మండల విద్యాధికారి మోహన్‌రాజు, ఏపివో జగన్, నాయకులు దుర్గయ్య, మార్కెట్ కమిటీ చైర్మేన్ రవీందర్‌నాయక్, ప్రధానోపాధ్యాయులు తుకారం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Stories: