ఇమ్రాన్‌కు భారత్‌లో అక్రమ సంతానం

రేహామ్ పుస్తకంలో ఆరోపణలు లండన్: పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (65)ను పెళ్లి చేసుకుని 10 నెలల వైవాహిక జీవితం గడిపిన జర్నలిస్ట్ రేహమ్ ఖాన్(45) తన పుస్తకంలో ఆయనపై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందినవారు కూడా ఉన్నారని తెలిపింది. 1970 దశకంలో బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఓ నటితో ఇమ్రాన్‌కు ఎఫైర్ ఉందని, తాను అతడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సెక్సియెస్ట్ హిరోయిన్ ఆధిపత్యం […]

రేహామ్ పుస్తకంలో ఆరోపణలు

లండన్: పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ (65)ను పెళ్లి చేసుకుని 10 నెలల వైవాహిక జీవితం గడిపిన జర్నలిస్ట్ రేహమ్ ఖాన్(45) తన పుస్తకంలో ఆయనపై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందినవారు కూడా ఉన్నారని తెలిపింది. 1970 దశకంలో బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఓ నటితో ఇమ్రాన్‌కు ఎఫైర్ ఉందని,

తాను అతడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సెక్సియెస్ట్ హిరోయిన్ ఆధిపత్యం కూడా ఉండేదని పేర్కొంది.  ఆమె రాసిన పుస్తకం పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇకాపీలుగా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున షేరవుతున్నాయి. కీశే. సామాజిక కార్యకర్త సిటా వైట్‌కు, ఇమ్రాన్ ఖాన్‌కు పుట్టిన కూతురు టైరియన్ గురించి తాము చర్చించుకున్నప్పుడు ఆయన అక్రమ సంతానం గురించి తెలిసిందని రెహామ్ తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ పితృత్వ పరీక్షకు నిరాకరించినప్పటికీ లాస్ ఏంజెల్స్ కోర్టు 1997లో టైరియన్‌కు అతడే తండ్రి అని తీర్పు చెప్పింది. కాగా సిటా వైట్ 2004లో కన్నుమూసింది. దాంతో టైరియన్‌కు ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సంరక్షకురాలయింది. రెహామ్ ఖాన్ తన పుస్తకంలో వెలువరించిన సంచలనాత్మక ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఎఇన్సాఫ్(పిటిఐ) ప్రతిసందించలేదు. రేహామ్ ఖాన్ పుస్తకం గురువారం విడుదలయ్యింది.  పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్ ఖాన్‌కు కొంతమేర చిక్కులు కల్పించగలదని తెలుస్తోంది.

Related Stories: