క్యూ1కు ముందు జీవనకాల గరిష్ఠానికి టిసిఎస్

న్యూఢిల్లీ: దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) షేరు విలువ జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.1,919కు చేరింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందే అత్యధిక స్థాయికి షేరు విలువ చేరుకోవడం విశేషం. మంగళవారంనాడు కంపెనీ ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. నగదు పంపిణీ ప్రయత్నంలో భాగంగా గత నెలలో రూ.16 వేల కోట్ల షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు టిసిఎస్ ఆమోదం తెలిపింది. షేరుకు రూ.2100 ధర వద్ద స్కీమ్ కింద […]

న్యూఢిల్లీ: దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) షేరు విలువ జీవనకాల గరిష్ఠ స్థాయి రూ.1,919కు చేరింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందే అత్యధిక స్థాయికి షేరు విలువ చేరుకోవడం విశేషం. మంగళవారంనాడు కంపెనీ ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. నగదు పంపిణీ ప్రయత్నంలో భాగంగా గత నెలలో రూ.16 వేల కోట్ల షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు టిసిఎస్ ఆమోదం తెలిపింది. షేరుకు రూ.2100 ధర వద్ద స్కీమ్ కింద 7.6 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. బైబ్యాక్ కార్యక్రమంలో మాతృ సంస్థ టాటా సన్స్ పాల్గొననుందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌లో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్ మైలురాయిని కంపెనీ అందుకుంది. ఈ మైలురాయిని చేరుకున్న దేశీయ తొలి లిస్టెట్ ఐటి కంపెనీ టిసిఎస్ కావడం గమనార్హం.

Related Stories: