మరింత బక్కచిక్కేనా?

ట్రేడ్ వార్ భయాలు, ముడిచమురు ధరలు, స్టాక్ మార్కె ట్ల పతనం వంటి కారణాలతో గతవారం డాలర్‌తో పోలి స్తే రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ కరెన్సీ 7 శాతంపైగా పతనమైంది. డాలరుతో మారకంలో ఇంట్రాడేలో 69.10ను తాకింది. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణం కాగా, వచ్చే రోజుల్లోనూ రూపాయి మరింతగా బక్కచిక్కే అవకాశముందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డాలరుతో మారకంలో రూపాయి 70ను […]

ట్రేడ్ వార్ భయాలు, ముడిచమురు ధరలు, స్టాక్ మార్కె ట్ల పతనం వంటి కారణాలతో గతవారం డాలర్‌తో పోలి స్తే రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారత్ కరెన్సీ 7 శాతంపైగా పతనమైంది. డాలరుతో మారకంలో ఇంట్రాడేలో 69.10ను తాకింది. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణం కాగా, వచ్చే రోజుల్లోనూ రూపాయి మరింతగా బక్కచిక్కే అవకాశముందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డాలరుతో మారకంలో రూపాయి 70ను తాకవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర ఆసియా కరెన్సీలలో ఫిలిప్పీన్స్ పెసో 6.7 శాతం, ఇండొనేసియన్ రుపయ్యా 4.3 శాతం చొప్పున పతనమయ్యాయి. చైనీస్ యువాన్ 1.6 శాతం బలహీనపడింది. 2016 నవంబర్ 24న ఇంట్రాడేలో రూపాయి విలువ 68.86 వద్ద కొత్త కనిష్టానికి చేరగా, 2013 ఆగస్ట్ 28న రూపాయి 68.80 వద్ద ముగిసి రికార్డు కనిష్టాన్ని నమో దు చేసింది. ఇప్పుడు మరింతగా క్షీణించింది. రూపాయి బలహీనపడడానికి పలు కారణాలు ఉన్నాయి.

వాణిజ్య యుద్ధం ఆందోళనలు
అమెరికా స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకం పెం పుతో ట్రేడ్ వార్‌కు తెరలేచింది. అప్పటి నుంచి మొదలు అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా పలు దేశాలు కూడా దిగుమతి సుంకాలను పెంచాయి. అమెరికాకు ధీటుగా చైనా కూడా టారిఫ్‌లను పెంచింది. యూరోపియన్ కూ డా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచింది. మరోవైపు చైనా తమ కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తొక్కిపట్టి ఉంచుతోంది. దీంతో రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపుతోంది.

చమురు ధరలు
ముడిచమురు ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరాయి. రష్యా సహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలను అమలుచేయడం వల్ల క్రూడ్ ధరలు పెరిగాయి. లిబియా, నైజీరియా సరఫరాలకు ఆటంకం, ఇరాన్‌పై అమెరికా ఆంక్ష లు ధరలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దేశీ ఇంధన అవసరాలకు 75 శాతం విదేశాలపైనే ఆధారపడటంతో దిగుమతుల బిల్లు పెరిగిపోతుంది. ఇది వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతోంది.

ఆర్‌బిఐ నిర్ణయం కీలకం
రూపాయి క్షీణతకు చెక్ పెట్టేందుకు గతంలో ఆర్‌బిఐ ప లుమార్లు జోక్యం చేసుకుంది. ఈసారి కూడా చర్యలు చేపట్టనుందని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ద్ర వ్యోల్బణం పెరగుతుండడంతో ఆర్‌బిఐ కఠిన విధానాలవైపు చూస్తోంది. ఇటీవల పావు శాతం రెపో రేటు పెం పును చే పట్టింది. కేపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పె ట్టుబడులు వెనక్కి మళ్లడం రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది.

Comments

comments

Related Stories: