మహిళా సంఘాలకు రేషన్ బాధ్యతలు

సివిల్ సప్లయ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ నేటి నుంచి రోజువారి షెడ్యూల్ ఖరారు 28న డీలర్లకు నోటీసులు, 29న సస్పెన్షన్ ఉత్తర్వులు 29, 30 తేదీల్లో గ్రామ సంఘాలకు ప్రత్యేక శిక్షణ డిఆర్‌డిఏ, మెప్మా అధికారులకు బాధ్యతలు మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో : రేషన్ డీలర్ల బాధ్యతలు స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీలర్లు సమ్మెబాట పట్టడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలగకుండా సివిల్ సప్లయ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్దమైంది. ఇదే […]

సివిల్ సప్లయ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ
నేటి నుంచి రోజువారి షెడ్యూల్ ఖరారు
28న డీలర్లకు నోటీసులు, 29న సస్పెన్షన్ ఉత్తర్వులు
29, 30 తేదీల్లో గ్రామ సంఘాలకు ప్రత్యేక శిక్షణ
డిఆర్‌డిఏ, మెప్మా అధికారులకు బాధ్యతలు

మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో : రేషన్ డీలర్ల బాధ్యతలు స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీలర్లు సమ్మెబాట పట్టడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలగకుండా సివిల్ సప్లయ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్దమైంది. ఇదే క్రమంలో డీలర్లపైనా క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సమ్మెలో పాల్గొంటున్న డీలర్లకు ఈ నెల 28న నోటీసులు జారీ చేసి, 29న వారిని తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని సివిల్ సప్లయ్ కమిషనర్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాలకు డీలర్ల బాద్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజు వారీ షెడ్యూల్ ఖరారు చేశారు. గ్రామాల్లో సంఘాల బాధ్యతలు డిఆర్‌డిఓకు, పట్టణాల్లోని సంఘాలకు మెప్మా అధికారులకు అప్పగించారు. ఈ అధికారులు గుర్తించిన సంఘాలకు రేషన్ నిర్వహణకు సంబంధించి 29, 30 తేదీల్లో శిక్షణ ఇవ్వాలి. జూలై 1న మీ సేవా కేంద్రాల్లో డీడీలు కట్టించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. జూలై 1 నుంచి 4 తేదీ వరకు తహసీల్దార్లు ఆర్‌వోలు జారీ చేయాలి. ఈ నెల 30 నుంచి 4 తేదీ వరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, ఇతర సరుకులను సరఫరా చేయడం ప్రారంభించాలి. జూలై 5 నుంచి 10 వరకు కార్డు దారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 355 , నిర్మల్ జిల్లా లో 390, మంచిర్యాల జిల్లాలో 423, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 275తో కలిపి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1443 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా దుకాణాల డీలర్లందరూ సమ్మెలో ఉన్నారు. అయితే డీలర్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నందున ప్రజా పంపిణీ జరుగుతున్న ప్రాంతాల్లో వారి వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నటువం టి ఈ పాస్ మిషన్లు, తూకాలు, ఇతర సామగ్రి అంతా మహిళా సంఘాలకు అప్పగించాలి. డీలర్లకు మాదిరే ఒక్కో దుకాణం వద్ద ఇద్దరు చొప్పున సహాయకులను నియమించుకోవచ్చు. వారికి సంబంధించిన ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఇతర వివరాలు సేకరించాలి. రే షన్ పంపిణీలో మహిళా సంఘాలకు ఇబ్బంది రాకుం డా మండల స్థాయిలో పనిచేస్తున్న గ్రామీణాభివృద్ది సిబ్బంది, మెప్మా సిబ్బంది సహకరించాలి. ఇక మండల స్థాయిలో తహసీల్దారు, ప్రత్యేక అధికారులు, ఆర్‌ఐలు, వీఆర్వోలు, ఎంపిడిఓలు, ఈఓఆర్‌డిలు, పంచాయితీ సెక్రటరీలు, ఎపిఎంలు, డిపిఓంలు, సిసిలు, జిల్లా స్థాయిలో డిఎస్‌ఓ, డిఎం, డిటిలు, డిఆర్‌డిఓలకు అప్పగించారు. తహసీల్దార్లకు మరేదైనా పని ఒత్తిడిలో ఉన్నట్లయితే వారి స్థానంలో కార్యాలయ సిబ్బందికి ఈ బాధ్యతలను అప్పగించాలని సూచించారు.

Related Stories: