డిసిసిబి మొబైల్ ఎటిఎంను ప్రారంభించిన: బాలసాని

ఖమ్మం: డిసిసిబి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఎటిఎంను శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో శాసన మండలి సభ్యులు, డిసిసిబి మాజీ చైర్మన్ బాలసాని లక్ష్మినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార బ్యాంకులు, సహకార సంఘాల పటిష్టతకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు కేటాయిస్తూ ఎంతో అభివృద్ది చేస్తున్నారన్నారు. రైతులకు ఎల్లవేళలా రుణాలతో పాటు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు ఎరువులు, విత్తనాలు, […]

ఖమ్మం: డిసిసిబి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఎటిఎంను శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో శాసన మండలి సభ్యులు, డిసిసిబి మాజీ చైర్మన్ బాలసాని లక్ష్మినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార బ్యాంకులు, సహకార సంఘాల పటిష్టతకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిధులు కేటాయిస్తూ ఎంతో అభివృద్ది చేస్తున్నారన్నారు. రైతులకు ఎల్లవేళలా రుణాలతో పాటు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా బ్యాంకును మరింత అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ బ్యాంకును ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో పురోభివృద్ది చేసి సుమారు రూ.2వేల కోట్ల టర్నోవర్‌కు కృషి చేశామన్నారు. రైతులకు రుణాలు అందిస్తూ బ్యాంకు పురోభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిఈవో వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: