కొలువుల జాతరకు సిద్ధమయ్యేదెలా?

 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ  శాఖల పరిధిలోని 2,786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. నిరుద్యోగుల కల సాకారం కానుంది. గవర్నమెంటు జాబ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ లక్షానికి పదును పెట్టే పనిలో ఉన్నారు.  లక్షం ఉన్నతంగా ఉంటే అనుకున్నది సాధించగలరంటున్నారు విద్యానిపుణులు. ఈ పోస్టులకు దాదాపుగా పది లక్షలకు పైగానే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనకేం వస్తుందులే, ఈ పోటీలో మనం […]

 రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ  శాఖల పరిధిలోని 2,786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. నిరుద్యోగుల కల సాకారం కానుంది. గవర్నమెంటు జాబ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ లక్షానికి పదును పెట్టే పనిలో ఉన్నారు.  లక్షం ఉన్నతంగా ఉంటే అనుకున్నది సాధించగలరంటున్నారు విద్యానిపుణులు. ఈ పోస్టులకు దాదాపుగా పది లక్షలకు పైగానే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనకేం వస్తుందులే, ఈ పోటీలో మనం నెగ్గుకురాగలమా అనే సందేహాన్ని అభ్యర్థులు ముందుగా పక్కన పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువు సాధించడం అసాధ్యంకాదు. 

ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి..
మంచి ఫలితాలు సాధించాలనుకునే అభ్యర్థులకు సాధారణంగా చెప్పే మొదటి సూచన ఇది. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న ఎంతో మంది తమ శక్తిసామర్థ్యాలకు ఎన్నో రెట్లున్న విజయాలను సాధించిన ఉదాహరణలు మనకు తెలుసు. ఒక ’బిలో యావరేజి’ న్యాయవాదిగా ఉన్న మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.. మహాత్మగాంధీగా మారడానికి, రామేశ్వరంలో పడవ నడిపే వ్యక్తి కొడుకు అబ్దుల్ కలాం.. ఇండియన్ మిస్సైల్ మ్యాన్‌గా మారడానికి వారు ఎంచుకున్న ఉన్నత లక్ష్యాలే కారణమని గుర్తుంచుకోవాలి.
పోటీ పరీక్షలకు సిద్ధమై.. రాసిన విద్యార్థులంతా ఎందుకు రాణించడం లేదు? తమ కోటాలో ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ఒకటి, రెండు మార్కులతో సీట్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని సంగతి అలా ఉంచండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో చాలామంది కనీసస్థాయి ప్రతిభను చూపడం లేదన్నది ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తుంది. పోటీ పరీక్షల్లో తక్కువస్థాయి సామర్థ్యం చూపించే విద్యార్థులకు, విజేతలుగా నిలిచే వారికీ మధ్య తేడాను వారు పరీక్షకు సన్నద్ధమయ్యే విధానాలను గమనిస్తే తెలుస్తుంది. క్రమశిక్షణ, అంకితభావం, తెలివితేటలు, నైపుణ్యాలు లాంటి అంశాల్లో ఉన్న తేడాలతో పాటు, విజేతలకు తమ లక్ష్యం మీద చాలా స్పష్టత ఉండటమనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు.. అంగీకరించరు.. ఎందుకంటే పైన చెప్పినట్లు ‘నేను ర్యాంకు తెచ్చుకోవాలి.. లేదా ఉద్యోగం తెచ్చుకోవాలి అనే లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది’ అని బల్లగుద్ది మరీ చెబుతారు. మరి తేడా ఎక్కడుంది? ఒక్కసారి చూద్దాం.
లక్ష్యం అంటే..? రాత పూర్వకమైన కోరికలే లక్ష్యాలుగా మారతాయి. లక్ష్యాలను రాసుకోవడం మాత్రమే కాదు.. వాటిని స్పష్టంగా వర్ణించాలి. ఈ వర్ణన కింద చెప్పినట్లుగా ‘స్మార్ట్ (SMART)’గా ఉండాలి. అంటే Specific, Measurable, Achieva ble, Relavent, Timebound.
Specific అంటే స్పష్టత. అంటే మనం నిర్దేశించుకున్న లక్ష్యం స్పష్టంగా ఉండాలి. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నాను అనేది కోరిక మాత్రమే. లక్షం కాదు. మరి స్పష్టమైన లక్ష్యం అంటే ఏమిటి?
‘నేను ఫలానా ఉద్యోగం సంపాదిస్తాను అనేది స్పష్టమైన లక్షం.
Measurable అంటే కొలవదగింది. ‘బాగా చదవాలి.. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అనేవి కొలవదగిన లక్ష్యాలు కాదు. ‘రోజుకు 12 గంటలు చదవాలి.. 90 శాతం మార్కులు తెచ్చుకోవాలి’ అనేవి కొలవదగిన లక్ష్యాలు.
Achievable అంటే అందుకోగలిగింది. లక్ష్యం మీరు సమీప భవిష్యత్తులో అందుకోగలిగేలా ఉండాలి. ఇప్పుడు పరీక్షల్లో 40 శాతం మార్కులు సంపాదిస్తుంటే.. వచ్చే నెలలో ‘నెలకు 60 శాతం సంపాదించాలి’ అనే లక్ష్యం పెట్టుకోవచ్చు. అంతేకానీ ‘ఒకేసారి 80 శాతం మార్కులు సంపాదించాలి’ అనే లక్ష్యం సాధించడం బహుశా అసాధ్యం.
Relavent అంటే తగింది. మనం నిర్దేశించుకుంటున్న లక్ష్యం మనకు తగిందిగా, అనుగుణమైందిగా, ఇష్టమైందిగా ఉండాలి. అంటే మన ఆసక్తులు, శక్తి సామర్ధ్యాలు, మన స్థాయి, మనకు అందుబాటులో ఉన్న సమయానికి తగిన విధంగా ఉండాలి. మీ చదువు, అందులో మీ విజ్ఞాన సామర్ధ్యానికి అనుగుణంగా మీ లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసినవారు వైద్య ఉద్యోగాలు సంపాదించలేరు కదా! మనకు ఏది సరిపోతుందో, మనం దేన్ని చేరుకోగలమో ఆ లక్ష్యానికి అనుగుణంగానే వ్యవహరించాలి.
Time bound అంటే కాలపరిమితి. మనం నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒక నిర్ణీత కాలపరిమితి ఉండాలి. అంటే ఒక వారంలో సాధించాలి.. ఒక నెలలో సాధించాలి.. ఇలా లక్ష్య ప్రస్తావనలో సమయం తప్పకుండా ఉండాలి. లక్ష్యాలు ఎప్పుడూ సానుకూలంగా ఉండాలి. సమయం వృథా చేయకూడదు అనే లక్ష్యం కంటే ‘సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అనే లక్ష్యం మంచి ఫలితం ఇస్తుంది.
లక్షాల్లో రకాలు : లక్ష్యాల్లో బహుముఖ లక్ష్యాలు, ఏకముఖ లక్ష్యాలు ఉంటాయి. జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకోవాలనే లక్ష్యం, సివిల్స్ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఒక లాంటివి కాదు. కొన్ని లక్ష్యాల సాధనకు మన శక్తియుక్తులను పరిమితమైన అంశాలపై కేంద్రీకరిస్తే సరిపోతుంది. మరికొన్ని లక్ష్యాల సాధనకు మనం కృషి చేయాల్సిన పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకునే యువకుడు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లిష్‌తోపాటు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు కూడా సన్నద్ధం కావాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవిద్యార్ధులు తమ లక్ష్యాలు ఏకముఖమైనవా? బహుముఖమైనవో తెలుసుకోవాలి. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడం అనే పెద్ద లక్ష్యాన్ని, విజయం సాధించడం కోసం చేయాల్సిన వివిధ పనులను చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. అలా విభజించుకున్న చిన్న లక్ష్యాలు పరిజ్ఞాన, నైపుణ్య, వ్యక్తిత్వ, వస్తు సంబంధమైనవిగా వర్గీకరించుకోవాలి. ఆర్థికశాస్త్రం, రాజ్యాంగం, జీవశాస్త్రం, అంకగణితం లాంటి సబ్జెక్టులపై పట్టు సాధించడం పరిజ్ఞాన సంబంధమైన లక్ష్యాలు. లెక్కలు వేగంగా చేయడం, నోట్సు తయారు చేసుకోవడం, స్పెల్లింగు, గ్రామర్ తప్పులు లేకుండా రాయడం లాంటివి నైపుణ్య సంబంధమైనవి.
బలహీనతలను జయించాలి : బద్ధకం వదిలించుకోవడం, మొహమాటం తగ్గించుకోవడం, సినిమాలు, ఛాటింగులూ లాంటి బలహీనతలను జయించడంలాంటివి వ్యక్తిత్వ సంబంధమైన లక్ష్యాలు. ఈ చిన్న లక్ష్యాలన్నీ సాధిస్తేనే ఉద్యోగం సాధించడం అనే పెద్ద లక్ష్యం సాధించడం సాధ్యమవుతుంది. పెద్ద లక్ష్యం సాధనలో విఫలమైనా, చిన్న లక్ష్యాల సాధనకు చేసిన కృషి మాత్రం ఎప్పటికీ వృథా కాదు. పోటీ పరీక్షకు మూడు నెలల సమయం ఉందనుకుంటే పరీక్షకు నాలుగు రోజుల ముందునాటికి సాధించాల్సిన లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలుగా భావించాలి. వారం వారం సాధించాల్సిన లక్ష్యాలు స్వల్పకాలిక లక్ష్యాలు. ఏ రోజుకు ఆరోజు పూర్తి చేయాల్సినవి తక్షణ లక్ష్యాలు.
మెటీరియల్ సేకరణ: పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం సేకరించేటప్పుడు అపోహలకు, వదంతులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. స్వయంగా ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారి నుంచే సలహాలు, సూచనలు తీసుకోవాలి. పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు చేస్తున్న వారు సాధారణంగా కోచింగ్ సెంటర్ల దగ్గర ఉండరు కదా! కోచింగ్ సెంటర్ల దగ్గర సీనియర్లు అని చెప్పుకునేవారు చాలాసార్లు పోటీ పరీక్షలు రాసి విఫలమై ఉంటారు. వారు నిరాశాపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది.
అలాగే చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షల గురించి సమాచారం సేకరించడంలోనే సమయమంతా గడిపేస్తారు. ఆ సమాచారాన్ని సద్వినియోగం చేయడం గురించి ఆచరణ మొదలెట్టరు. కనిపించిన సమాచారమంతా సేకరించుకుంటూ పోతే అది స్పష్టతకు దారితీయదు సరికదా! అమోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది.
ఏం చేయాలో కలలు కనండి: ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే.. రాత్రి పడుకునే ముందు మన లక్ష్యాన్ని సాధించినట్లు ఊహించుకోవడం (గోల్ విజువలైజేషన్) వల్ల మనలోని మానసిక శక్తులను లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్రీకరించేందుకు ఉపయోగపడుతుందన్నది మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ‘కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి’ అనే అబ్దుల్ కలాం నినాదం అందరికీ తెలిసిందే. దాన్ని మన ప్రధాని నరేంద్రమోదీ మరింత ఆచరణీయంగా మార్చి చెప్పారు. ఏం కావాలో కలలు కనొద్దు. ఏం చేయాలో కలలు కనండి’ అన్నారు. అంటే గ్రూప్-2 పోస్టు సాధించినట్లు” కాకుండా.. గ్రూప్-2 పరీక్షలో 90 శాతం మార్కులు సాధించినట్లు” కలలు కనాలన్నమాట.

సోక్రటీస్, అతడి శిష్యుడి కథ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాలి. తమ విజయ రహస్యం ఏమిటని అడిగిన శిష్యుడిని సాయంత్రం నది వద్దకు రమ్మన్నాడు సోక్రటీస్. నదిలో తనతో కలిసి స్నానం చేయమని ఆహ్వానించాడు. స్నానం చేసే సమయంలో శిష్యుడిని పట్టుకుని బలంగా నీటిలో ముంచేశాడు. ఊపిరాడక గిజగిజలాడిన శిష్యుడు, ఎంతో కష్టం మీద నీటి నుంచి బయటపడ్డాడు. అలా బయట పడిన తర్వాత సోక్రటీస్ శిష్యుడితో ‘నీవు నీటిలో మునిగి ఉండగా గాలి కావాలని ఎంత బలంగా కోరుకున్నావో, విజయం సాధించాలని కూడా అంతే బలంగా కోరుకున్నప్పుడు నీకు విజయం కచ్చితంగా దక్కుతుంది’ అని వివరించాడు. అంటే లక్ష్యం పట్ల అంత బలమైన కోరిక పెంచుకోవడం తేలిక కాదు. మీరు ఎందుకు లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో, అలా సాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రగతి సాధించాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. ఏదైనా కారణంతో లక్ష్యం సాధించలేకపోతే ఎంత నష్టపోతారో అంచనా వేసుకోవాలి. ఆ నష్టానికి, లక్ష్యసాధనలో పడాల్సిన కష్టానికి సిద్ధపడితే మీ  కోసం, మీ కుటుంబ భవిత కోసం లక్ష్యసాధనలోకి దిగాలి. అప్పుడు ఆ లక్ష్యం ఆశయంగా మారుతుంది.

Comments

comments

Related Stories: