దశల వారిగా రాచకొండ అభివృద్ధి

మన తెలంగాణ/సంస్థాన్‌నారాయణపురం:  దశలవారిగా అభివృద్ధి చేస్తా మని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగ దీశ్‌రెడ్డి పునరుధ్ఘాటించారు. మంగళవారం నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని ఐదుదొనల తండాలో రాచ కొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రక్షక బాటను సిపి మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమా నికి పెద్దపీట వేస్తుందన్నారు. రాచకొండ ప్రాంతంలోని ఐదుదొనల తండా, […]

మన తెలంగాణ/సంస్థాన్‌నారాయణపురం:  దశలవారిగా అభివృద్ధి చేస్తా మని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగ దీశ్‌రెడ్డి పునరుధ్ఘాటించారు. మంగళవారం నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని ఐదుదొనల తండాలో రాచ కొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రక్షక బాటను సిపి మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమా నికి పెద్దపీట వేస్తుందన్నారు. రాచకొండ ప్రాంతంలోని ఐదుదొనల తండా, పల్లగట్టు తండా, కడీలబావి తండా గిరిజన రైతులకు 20 రోజులలో పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు రైతు బంధు చెక్కులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రైతులకు 17 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసి ఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు 5 లక్షల ప్ర మాద బీమా కల్పించనున్నట్లు తెలిపారు. రై తులకు రుణమాఫీ చేసినా ముఖ్యమంత్రికి కె సిర్‌కు తృప్తి లేదన్నారు. రైతులు అప్పులు లే కుండా వ్యవసాయం చేసిన నాడే తృప్తి కలుగుతుందని    ముఖ్య మంత్రి తనతో అన్నట్లు మంత్రి వెల్లడించారు. అందుకే ఏ ఒక్క రైతు గూడా అప్పు చేయ కూడదనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచించి పెట్టుబడి సాయం క్రింద ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు ఇస్తున్నాడన్నాడని, ఇప్పటి వరకు రైతులకు రూ. 5200 కోట్లు పంచడం జరిగిందన్నారు. గిరిజనుల కోసం ప్రభుత్వం 500ల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య శిభిరాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు.

వ్యవసాయానికి కావలసిన నాలుగు ముఖ్యమైన అంశాలలో సాగునీరు కోసం ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందని, రైతులకు 24 గంటల కరెంటు అందిస్తుందని, పెట్టుబడి అందించిందని, ఇకపోతె మద్దతు ధర విషయంలో రైతు సమన్వయ కమిటీల ద్వారా నిర్ణయించి త్వరలో కల్పిస్తామని తెలిపారు. మిషన్ భగీరధ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్వరలో మంచి నీళ్ళు రాబోతున్నాయన్నారు. 60 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి నాలుగు సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలతో పాటుగా అడగనివి గూడా ఒక పెద్దన్నలా ఆలోచించి కావలసినవి అన్నీ చేస్తూ దేశంలోనే నెం 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చు కుంటున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పథకాలను అన్నింటిని ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. రాచకొండలో ఎత్తిపోతల పథకం ద్వారా సాగు జలాలు అందించేందుకు డీపీఆర్ తయారువుతున్నట్లు పేర్కొన్నారు. నన్ను ఆదరించి గెలిపించి ఎమ్మెల్యే నౌకరిచ్చిన మీకు ఎల్లవేలలా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ రాచకొండ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని, ఇక్కడి గిరిజనులకు అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. అనంత రం ఇంబ్రాహిం పట్నం నుంచి ఐదుదొనల తండా వరకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన టిఎస్‌ఆర్‌టిసి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాంచంద్రారెడ్డి, ఏసిపి రమేష్, ఆర్డీఓ సూరజ్‌కు మార్, ఎంపిపి బుజ్జి, జెడ్పిటిసి బొల్ల శివశంకర్, సిఐ వెంకటయ్య, తహసీల్ధార్ శ్రీనివాస్‌కుమార్, ఎంపిడిఓ సరస్వతి, స్థానిక సర్పంచి కాట్రోతు సాగర్, ఎంపిటిసి కత్తుల లక్ష్మయ్య పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: