లక్ష్యం చేరాలంటే..

కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుంది. ఇప్పటి వరకు సెలవుల్లో హాయిగా ఆడుతూ, పాడుతూ గడిచిపోయింది. ఇక నుండి చదువులు చదవటం ప్రారంభించాలి. కొత్త కోర్సుల్లో చేరి ఉన్నత స్థానానికి రావాలని కలలు కంటూ ఉంటారు. కానీ వాటిని పొందాలంటే జీవనగమనంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే లక్షాలు త్వరగా సాధించవచ్చు. రొటీన్ లైఫ్‌లో ఎలా మార్పులు చేసుకోవాలో తెలీక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ మీరు కన్న కలలను సాకారం చేసుకోండి. మీ […]

కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుంది. ఇప్పటి వరకు సెలవుల్లో హాయిగా ఆడుతూ, పాడుతూ గడిచిపోయింది. ఇక నుండి చదువులు చదవటం ప్రారంభించాలి. కొత్త కోర్సుల్లో చేరి ఉన్నత స్థానానికి రావాలని కలలు కంటూ ఉంటారు. కానీ వాటిని పొందాలంటే జీవనగమనంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే లక్షాలు త్వరగా సాధించవచ్చు. రొటీన్ లైఫ్‌లో ఎలా మార్పులు చేసుకోవాలో తెలీక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ మీరు కన్న కలలను సాకారం చేసుకోండి. మీ గురించి ఇంట్లో ఎవరినీ కష్టపెట్టకుండా కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుని మీ గోల్‌ను సాధించవచ్చు.

సింపుల్‌గా మొదలు పెట్టాలి..

రోజూ ఉదయాన్నే లేవగానే గ్లాసుడు నీళ్లు తాగండి. ఇలా కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా నీళ్ల పరిమాణం పెంచటానికి ప్రయత్నించండి. తరువాత యోగా కాసేపు ట్రై చేయండి. మీకే మార్పు కనిపిస్తుంది. ఈ నియమాలు ప్రతిరోజూ పాటిస్తూ ఉండండి. ఇక లంచ్‌లో తప్పనిసరిగా కూరగాయలు ఉండేలా చూసుకోండి. మీ ఆరోగ్యంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఆరోగ్యం బాగుంటే ఆలోచనలు మంచివి వస్తాయి. లేవగానే ఈ -మెయిళ్లు, మెసేజ్‌లు, చెక్ చేయటాన్ని కొంచెంసేపు వాయిదా వేయండి.

బోర్ కొట్టకుండా సరదాగా …

అప్పుడప్పుడు డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్ళటం, హార్స్ రైడింగ్, అవుట్ డోర్ ఎడ్వెంచర్స్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా మెదడు చురుకుగా పనిచేయటానికి పజిల్స్ లాంటివి చేస్తూ ఉండాలి. ఒక కొత్త ఆటలు ఏమైనా ఉంటే ఆడటం, ఒక కొత్త వంటకం చేయటం లాంటివి కూడా చేస్తే అప్పుడప్పుడు సరదాగా ఉంటుంది.

వద్దు అనొద్దు : ఏదైనా కోర్సు నేర్చుకోమని పెద్దవాళ్లు చెబితే నో అనొద్దు. దానికి కావలసిన ట్రైనింగ్ పొందటం, వాటి గురించి పెద్దవాళ్లని ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకుని పూర్తి చేయటానికి ఆలోచించాలి. ఇంట్లో మీ కంటే చిన్నవాళ్లు ఉంటే వారి సహాయం కూడా తీసుకుని మీ పని ఆగకుండా ప్రయత్నాలు చేసుకోవాలి.

ఆలస్యమైనా మార్పులు చేసుకోండి..

మీకు మద్యం సేవించే అలవాటు ఉంటే నెమ్మదిగా తగ్గించండి. కొంచెం సేపు మెడిటేషన్, వ్యాయామం చేయాలి. అలా చేస్తూ పోతే మార్పులోని మంచిని మీరే గ్రహిస్తారు.

ఏది ఇష్టమే అదే చేయండి..

మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఏ డాక్టరో, ఇంజనీరునో చేయాలని అనుకుంటారు. మీకు ఇష్టంలేకపోతే మీరు అనుకున్నది చదివేయండి. దానివల్ల మీకు ఏఏ లాభాలు ఉంటాయో తెలుసుకోండి. దానిని బట్టి మార్పులు చేసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఏఏ లక్షాలు మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో. భవిష్యత్తును బంగారంలా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది.

ఆయిలీ ఫుడ్స్ వద్దు…

టిఫిన్ కింద రోజూ తినే ఇడ్లీ, దోసె, పాస్తా, పిజ్జాలు, లాంటివి వద్దు. ఒక పండు చిన్న ముక్కలుగా తినటం అలవాటు చేసుకోండి. వారంలో ఒక ఐదు రోజులు వాకింగ్ చేయండి. రాత్రిపూట అన్ని పనులు ముగించుకుని నిద్రపోవటానికి లేట్ అవుతోందా? నెమ్మదిగా ఒక పది నిముషాలు ఆ టైమ్‌ను ముందుకు జరపండి. ఇలా చిన్నచిన్న మార్పులతో మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకు వస్తుంది.

Comments

comments