డయాలసిస్ యూనిట్‌ పేదలకు వరం

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత మనతెలంగాణ/జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్‌పేద ప్రజలకు వరమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రికి మంజూరైన డయాలసిస్ యూనిట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డయాలసిస్ సేవలు అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ వ్యాధి గ్రస్తులు డయాలసిస్ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కరీంనగర్, హై దరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, తద్వారా ఆర్థిక భారం పడటంతో […]

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్‌పేద ప్రజలకు వరమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రికి మంజూరైన డయాలసిస్ యూనిట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డయాలసిస్ సేవలు అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ వ్యాధి గ్రస్తులు డయాలసిస్ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కరీంనగర్, హై దరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, తద్వారా ఆర్థిక భారం పడటంతో పాటు సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్ ఏర్పా టు వల్ల ప్రతి రోజు 20మందికి ఉచితంగా వైద్య సేవలు అందుతాయన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నూత నంగా ఏర్పాటు చేసిన ప్రసూతి కేంద్రాన్ని ఎంపి ప్రారంభించారు. జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, 60శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు.జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వసతుల లేమి, డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రతి నెలా 400 ప్రసవాలు జరగడాన్ని ప్రశంసిస్తూ వైద్యులను, సిబ్బందిని అభినందించారు.జిల్లాకు ప్రసూతి ఆస్పత్రి మ ంజూరైందని, ఎస్‌ఆర్‌ఎస్‌పి క్యాంపు లో 10ఎకరాల స్థలంలో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రిని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వచ్చే నెలలో ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చే యనున్నట్లు తెలిపారు.
ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి వెంట వచ్చే కుటుం సభ్యులకు కూడా ఉచితంగా భోజన వసతి క ల్పిస్తున్నామన్నారు.జిల్లా ప్రజల ఆ రోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని గుండె, తదితర జఠిలమైన వ్యా ధులకు వైద్య సేవలందించే స్పెషలి స్ట్ వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొ ప్పుల ఈశ్వ ర్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్,స్థానిక ఎంఎల్ ఏజీవన్‌రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ,జిల్లా కలెక్టర్ శర త్,జిల్లా వై ద్యాధికారి డాక్టర్ సుగంధిని,డాక్టర్ జయపాల్‌రెడ్డి, ఆ స్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సదామోహన్, జ డ్‌పిటిసి పెండెం నాగలక్ష్మి,సారంగాపూర్ ఎంపిపి కొల్ము ల శార ద,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రా వు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: